సాధారణంగా మన ఇంటి ఆవరణంలో తప్పకుండా కనిపించే చెట్లలో మునగ చెట్టు ఒకటి. మునగ చెట్టు కాండం నుంచి కాయలు, ఆకులు, పువ్వుల వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. మునగ చెట్టు నుంచి లభించే ఆకులు కాయలను నిత్యం మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మునగాకులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఎవరూ ఉండరు.
సాధారణంగా మనం మునగాకుతో తాలింపు చేసుకొని తింటాము. ఈ విధంగా తాళింపు తినడం వల్ల మునగాకులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. మునగాకులో ఉన్నటువంటి ఈ పోషకాలు కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి.అజీర్తి సమస్యలతో బాధపడేవారు ములగాకు రసంలోకి కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ మునగ ఆకుల పొడిని మజ్జిగలో కలుపుకుని పరగడుపున తాగడం వల్ల ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.
కొందరిలో తరచూ తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటుంది. ఈ విధంగా తలనొప్పితో బాధపడేవారు మునగ ఆకుల పొడి మిశ్రమాన్ని కొద్దిగా నీటిలో కలిపి తలపై వేసుకోవటం వల్ల తొందరగా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా ఈ మునగ ఆకుల పొడిని తలకు రాయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొంది జుట్టు ఎంత దృఢంగా తయారవుతుంది.
మునగ చెట్టు బెరడును ఆవు పాలలో మరిగించి దానిని ఎండబెట్టి కషాయంలా తయారు చేయాలి. ఈ పొడిని మూడు పూటలా నెల రోజులు పాటు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్య కణాలు వృద్ధి కలుగుతుంది. అలాగే మునగ పూలు పాలలో కలుపుకుని తాగడం వల్ల ఆడవారికి మగవారికి శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మొటిమలతో బాధపడేవారు మునగాకు మిశ్రమంలోకి కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయడం ద్వారా మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. ఈ విధంగా ప్రతి రోజు మునగ ఆకులను మన ఆహార పదార్థాలలో భాగంగా చేర్చుకోవడం వల్ల పై తెలిపిన ప్రయోజనాలన్నింటిని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Share your comments