మారుతున్న కాలంలో పాటుగా శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే శరీర పెరుగుదలతో పాటు అనేక రోగాలను తట్టుకునే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాంటి వాటిల్లో ఆకుకూరగాయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆకుకూరగాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయనీ, వీటిని నిత్యం ఆహారంగా తీసుకోవాలనీ, మరీ ముఖ్యంగా ప్రస్తత కరోనా సమయంలో ఆకుకూరలను రోజు తింటే మంచిదని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆకుకూరల్లో అధికంగా పోషకాలు, ఐరన్ కలిగి ఉన్న వాటిల్లో పాలకూర కూడా ఒకటి. అలాంటి పాల కూర సాగు గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పాలకూర సాగు విధానం:
మన దేశంలో అధికంగా పండించే ఆకు కూరల్లో పాలకూర ఒకటి. పాలకూర అన్ని రకాల ప్రాంతాల్లో పెరుగుతుంది. అయితే, ఉష్ణ మండల, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. దిగుబడి సైతం ఆయా ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది. పాలకూరను అన్ని రకాల నేలలతో పాటు చౌడు భూముల్లోనూ పాలకూరను పండించవచ్చు. ముందుగా పాలకూర పండించాలనుకున్న నేలను దున్నుకోవాలి. నేల ఎంత తేలికగా ఉంటే పంట అంత అధికంగా వస్తుంది. చిన్నచిన్న మడులుగా చేసుకుంటే పాలకూర సాగుకు అనుకూలంగా ఉంటుంది. నీరు పారించడం కూడా తెలికగా ఉంటుంది. పంటకాలం అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాలు అయిన.. సంవత్సరం పొడవునా దీనిని సాగు చేయవచ్చు. నేలను తయరు చేసుకున్న తర్వాత విత్తనాలను 20 సెంటీ మీట్లర దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత నీటిని పెట్టాలి. వారం నుంచి పది రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. మొత్తం 15 నుంచి 20 రోజుల్లో కొతకు వస్తాయి.
అంతర కృషి:
పాలకూరలో సాగులో అత్యంత ముఖ్యమైన విషయం పంటలో కలపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అందుకోసం విత్తనాలు నాటడానికి ముందు పాలకూర సాగుకు సంబంధించిన కలుపు మందును నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. అలాగే, నేలను సిద్ధం చేసుకునే సమయంలో పశువుల ఎరువులు వేసుకుంటే పంట దిగుబడి మంచిగా ఉంటుంది. పంట కొత తర్వాత కూడా ఎకరాకు పది కిలోల నత్రజని సంబంధ ఎరువులు వేసుకోవాలి. చీడపీడలు ఆశిస్తే.. మందులు పిచికారీ చేసుకోవాలి.
Share your comments