Agripedia

తెలంగాణ: నేటి నుంచి 5 ఎకరాలకు పైన రైతులకు రైతు బంధు ..

Srikanth B
Srikanth B

హైదరాబాద్: ఐదెకరాలకు పైగా ఉన్న రైతుల ఖాతాల్లో మంగళవారం నుంచి రైతుబంధు సొమ్ము జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 51.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.3,946 కోట్లు జమ చేసిందని తెలిపారు.వానకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంపిణీని మంత్రి సోమవారం ఇక్కడ సమీక్షించారు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద 78.93 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించామని తెలిపారు.

ఐదెకరాలకు పైగా ఉన్న రైతులకు రుణమాఫీ మంగళవారం నుంచి ప్రారంభం కానుండడంతో పంపిణీలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


రైతుబంధు డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండి, మీ అకౌంట్‌లో రైతుబంధు డబ్బులు జమ కాకపోతే వ్యవసాయ విస్తరణాధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.వ్యవసాయ అధికారి చెక్ చేసి మీకు ఎందుకు రాలేదో తెలియజేస్తారు ఆ సూచనలు పాటిస్తే మీకు రైతుబంధు డబ్బులు జమ అవుతాయి.

అకౌంట్ వివరాలు, చెక్ బుక్ వివరాలు వ్యవసాయ అధికారులకు అందించకపోతే రైతుబంధు డబ్బులు జమ కావు. గతంలో కూడా చాలామంది బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించలేదు. అందుకే రైతులు సరైన బ్యాంక్ అకౌంట్ వివరాలను అధికారులకు అందించాలి.

రైతుబంధు డబ్బులు అకౌంట్లోకి  వచ్చాయా? లేదా? తెలుసుకోండిలా?

-https://treasury.telangana.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి
-ఆ తర్వాత అక్కడ మెనూ బార్‌లో ఉండే రైతుబంధు స్కీమ్ రబీ డీటైల్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
-ఆ తర్వాత సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయాలి
-ఆ తర్వాత స్కీమ్ వైజ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి మీ వివరాలు, సంవత్సరం, పీపీబీ నెంబర్ ఇవ్వాలి.
-అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వచ్చాయో.. లేదో తెలుస్తుంది.

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త .. మరో 1,663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

 

Share your comments

Subscribe Magazine