తెల్లబంగారంగా పిలవబడే పత్తి రైతులను నష్టాల్లోకి నెట్టుతుంది. పత్తి పంట వేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పంట పండించాడనికి అప్పులు చేసి మరి రైతులు పండిస్తున్నారు. అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు కూడా తయారయ్యాయి. నకిలీ విత్తనాల వాళ్ళ దిగుబడులు తగ్గిపోయాయి, దీనితో పాటు మార్కెట్ దళారులు మద్దతు ధర తగ్గించడంతో రైతులు కష్టాలు పడుతున్నారు.
ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన పత్తి ధర, ప్రస్తుతం మార్కెట్ లో పత్తి ధర కాస్త పెరిగింది. మార్కెట్ లో కొన్నీ రోజుల క్రితం పత్తి ధర రూ.7,300- రూ.7,400 వరకు పలికింది. రైతులకు కొంచెం ఊరట కలిగిస్తూ శుక్రవారం ఈ పత్తి ధర అనేది రూ.7,950- రూ.8 వేలకు పలికింది. దీనితో ఇప్పటి వరకు ఇంటి వద్దనే పత్తిని నిల్వ చేసుకున్న రైతులు మార్కెట్ లోకి విక్రయిస్తున్నారు. కొద్దిగా పత్తి ధర పెరగడం రైతులకు కొంచెం ఊరట కలిగిస్తుంది.
గత సంవత్సరం మార్కెట్ లో ఈ పత్తి ధరలు అనేవి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న రూ.8 వేలకు పత్తిని అమ్మలా లేదా వద్దా అని ఆలోచనల్లో రైతులు ఉన్నారు. మల్లి పత్తికి పాత ధరలు వస్తాయి అని చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. వ్యాపారులు ఏదిఏమైనా క్వింటాలుకు రూ.7,600 కన్నా తగ్గే పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
రైతులకు మరొక అవకాశం.. మిస్ చేసుకోకండి
ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 8నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాల కారణంగా ఎకరానికి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదని రైతులు చెబుతున్నారు. క్వింటాలుకు కనీసం రూ.10 వేలు చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతందని, లేదంటే నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పత్తి అమ్మడంలో దళారుల చేతిలో మోసపోతున్న పట్టించుకునే వారే లేరు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో పత్తి సాగును ప్రోత్సహిస్తుంటే మరోవైపు వానాకాలం లో పండించిన పంటను కొనే నాధుడే లేదు . దళారులు చెపింది రేటు ఇచ్చిందే మద్దతు ధర అన్న చందనం గ మారింది రైతుల పరిస్థితి. గత కొన్ని రోజులగా పత్తికి మద్దతు ధర లేక రైతులు పత్తి పంటను ఇంట్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments