Agripedia

భూమిని సారవంతం చేసే వర్మీ కంపోస్ట్ తయారీ ,ప్రాముఖ్యత.!

Srikanth B
Srikanth B

వానపాములు నేలను సహజ పద్ధతిలో సారవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వానపాములను రైతులకు సహజ మిత్రులుగా చెప్పవచ్చు. వానపాము సహజంగా తేమగల నేలల్లో బొరియలు చేసుకుని భూమిలోని సేంద్రియ వ్యర్ధాలను ఆహారంగా తీసుకుని సారవంతమైన మట్టిని విసర్జిస్తాయి. ఈ విసర్జిత పదార్థాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు.

 

వర్మీ కంపోస్ట్ తయారీ విధానం:

మొదట అనుకూలమైన పరిమాణంలో బెడ్ నిర్మించుకోని ,బెడ్ అడుగుభాగంలో కాంక్రీట్ తప్పనిసరిగా వేసుకోవాలి.లేకపోతే వానపాములు భూమిలోకి వెళ్లి పోయే ప్రమాదం ఉంది.బెడ్ పైన అధిక సూర్యరశ్మి ,వర్షం పడకుండా పైకప్పు నిర్మించుకోవాలి.తర్వాత వివిధ రకాల పంట వ్యర్థాలను, పశువు ఎరువులను సేకరించి పెట్టుకోవాలి.బెడ్ అడుగుభాగంలో ఆలస్యంగా కుళ్ళే కొబ్బరి ఆకులు, చెఱకు ఆకులు, మినప, అరటి ఆకు వంటి వ్యర్ధాలను వేసుకోవచ్చు.తర్వాత పూర్తిగా కుళ్ళిన పశువుల పేడను వేసుకోవాలి తరువాత పంటపొలాలలోని కూరగాయాల వ్యర్థాలు, చెత్తాచెదారం వేసుకొని రెండు వారాల పాటు పాక్షికంగా పేట నీరు చల్లుకోవాలి. బెడ్లులో 30 నుంచి 40 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.

రబీ పంటకు ఎరువుల కొరత లేదు.. !

తరువాత నాణ్యమైన వానపాములను సేకరించి చదరపు మీటరు విస్తీర్ణానికి 1500 నుంచి 2000 వరకు వదులుకోవచ్చు. వానపాములు వదిలిన తర్వాత తేమ శాతం తగ్గకుండా నీరు చల్లుతూ ఉండాలి. తేమ తొందరగా ఆరిపోకుండా బెడ్ పైన పాత గోనేసంచులు కప్పి ఉంచి దాని పైన నీళ్లు చల్లితే తేమ తొందరగా ఆరిపోదు. వర్మీ కంపోస్ట్ తయారు కావడానికి మొదటిసారి 2-3 నెలల సమయం పడుతుంది. తర్వాత వానపాముల సంఖ్య పెరగడంతో 3 నెలల కంటే ముందే వర్మీ కంపోస్టు తయారవుతుంది. వర్మీ కంపోస్ట్ తయారు అయిన తర్వాత నాలుగు రోజుల పాటు తేమ అందించడం ఆపేస్తే వానపాములు బెడ్ అడుగుభాగం వెళ్లిపోతాయి.తర్వాత బెడ్లో తయారైన వర్మీకంపోస్టు సేకరించి జల్లెడ పట్టి నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవాలి.

రబీ పంటకు ఎరువుల కొరత లేదు.. !

Related Topics

vermicompost

Share your comments

Subscribe Magazine