తెలంగాణంగా యాసంగి లో రికార్డు స్థాయిలో వరి పంట సాగవుతున్న విషయం తెలిసినదే .. ప్రస్తుతం రాష్ట్రము లో ఇప్పటికే 10 లక్షల ఎకరాలలో వరి సాగు జరిగితే , కొన్ని చోట్ల పంట నారుమడి దశ నుంచి పిలకలు తొడిగే దశలో ఉంది అయితే ఏ క్రమంలో అధికంగా ఆశించే కాండం తొలిచే పురుగు , రెక్కల పురుగులు దాడి అవకాశం ఉందని గమనించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ,'వరి పరిశోధన సంస్థ' రైతులకు హెచ్చరిక జారీ చేసింది .
కాండం తొలిచే పురుగు - యాజమాన్యం నివారణ చర్యలు ...
. గత వారం రోజులుగా కాండం తొలిచే పురుగు రెక్కల పురుగులు మరియు గ్రుడ్ల సముదాయాలు గమనించడం జరుగుతుంది. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం పిలకదశలో కాండం తొలిచే పురుగు ఉద్భతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కావున వీటి నివారణకు ఈ క్రింది. సూచనలు పాటించాలి.
• పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎరను, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
• పిలకదశలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చేపట్టాలి.
అధిక దిగుబడి ఇచ్చే 61 కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేసిన PJTSAU
• ప్రధాన పొలంలో గుళికల మందులు వాడితే ఖర్చు ఎక్కువవుతుంది. గనుక, నారు నాటే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రా. ల కార్బోప్యూరాన్ 3జి గుళికలు లేదా 600 గ్రా.ల ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి.
• ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో ఈ యాసంగిలో తప్పకుండా ఎకరాకు కార్బోప్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 48 గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0, 4జి 4 కిలోలు వేయాలి.
• కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లార్వా దశలో వరి పైరును నష్టపరుస్తున్నట్టు సమాచారం అందుతుంది. అలాంటి ప్రాంతాల్లో క్వినాల్ఫాస్ 2 మి.లీ, ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పి 2 గ్రా.లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
డా॥ సి. రఘురామి రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త (వరి) & హెడ్
వరి పరిశోధన సంస్థ. రాజేంద్రనగర్, హైదరాబాద్ - 30
Share your comments