Agripedia

మిర్చి పంటను వీడని తెగుళ్లు .. రైతులకు లక్షల్లో నష్టాలు .. పరిష్కార మార్గం ఏది ?

Srikanth B
Srikanth B
Pests attack on chilli crop...
Pests attack on chilli crop...

ఉమ్మడి ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని మిర్చి పంట రైతులకు కష్టాలనే మిగిలించింది . మిర్చి కోతకు వచ్చే దశకు తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు . ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో పండే మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది . గత పంటకు మిర్చిని క్వింటాలుకు రూ. 22,800 గరిష్ఠ ధర పలికింది . దీనితో అధిక లాభాలను పొందవచ్చని భావించిన రైతులు అప్పులు చేసిమరీ మిర్చి సాగుచేస్తున్నారు . గత సంవత్సరం నుంచి మిర్చి సాగు చేసే రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయి .. కనీసం ఈ సంవత్సరం అయిన పంట బాగా వస్తుందని రైతులు ఆశించారు .

జిల్లాలో 25 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. ఎకరానికి సుమారు రూ.1.30 లక్షల వరకు పె ట్టుబడులు పెట్టారు. తెగుళ్ల కారణంగా దిగుబడి ఎంత వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వరుస తెగుళ్లతో ఆందోళన..
మిరప తోటలకు వరుస తెగుళ్లు సోకుతున్నాయి. గులాబీ రంగు పురుగుతో దిగుబడులు తగ్గుతు న్నాయి. పంట ప్రారంభంలో బాగానే ఉన్నా పలు చోట్ల కంకర తెగులు పూత దశలో నల్లతామర తెగులు పంట దిగుబడి పై తీవ్రంగా ప్రభావం పడుతుంది .


తెగుళ్లు సోకుతున్న ప్రాంతాలలో వ్యవసాయ అధికారులు అన్ని మండలాలు తిరుగుతూ తెగుళ్ల నివారణపై రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ప్రతి ఏటా ఒకే పంట సాగు చేయడంతో ఈ పరిస్థితి వస్తోంది. పంట మార్పిడి చేసుకుంటే తెగుళ్ల బెడద ఉండదు అని సూచిస్తున్నారు .

యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..

జనవరి 2022 నుండి, తెలంగాణాలో ఇరవై మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రైతుల పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి . దీనికి తోడు రైతులు చేసిన అప్పులు తీర్చలేక జనవరి 2022 నుండి తెలంగాణలో 20 మందికి పైగా రైతులు ఆత్మహత్యలతో చేసుకున్నారు .

. దీనికి కారణం తెగుళ్ల దాడి వాళ్ళ తీవ్రంగా నష్టపోవడమే దీనికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో మానవ హక్కుల వేదిక మరియు స్వతంత్ర సంస్థ ఈ సమస్యను పరిశోధించడానికి ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ : మిర్చి పంటలో గంజాయి సాగు..

Share your comments

Subscribe Magazine