దేశంలో పంటలను పండించడానికి పురుగు మందుల వాడకం అధికంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో పోల్చుకుంటే క్రిమిసంహారకాలను (పెస్టిసిడ్స్) వాడటంతో భారతదేశం నాలుగోవ స్థానంలో ఉంది. ఇది ఇలా ఉండగా భారతదేశంలో అత్యధికంగా క్రిమిసంహారకాలను వాడుతున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నాలుగోవ స్థానంలో ఉంది. రైతులు ఆలోచించకుండా పురుగులను మరియు తెగుళ్లను నివారించడానికి సిఫార్సు చేసిన మోతాదు కంటే అధికంగా వాడుతున్నారు. ఈ విధంగా అధికంగా క్రిమిసంహారకాలను వాడితే పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది. దానితో పాటు భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ పురుగు మందుల వాడకంపై రైతులు ద్రుష్టి పెట్టాలి.
భారతదేశంలో ప్రతి సంవత్సరం 62,193 మెట్రిక్ టన్నుల పెస్టిసిడ్స్ ని వినియోగిస్తున్నారు. ఇందులో కేవలం ఒక్క మహారాష్ట రాష్ట్రంలోనే 20 శాతం పురుగు మందులను వాడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన కొత్తలో 2,862 మేమెట్రిక్ టన్నుల పరుగు మందులను వినియోగిస్తే, ఇప్పుడు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగినందున ఈ పెస్టిసిడ్స్ వినియోగం ఏకంగా 4,986 మెట్రిక్ టన్నులకు చేరింది. భారతదేశంలో పరిమితికి మించి ఈ పురుగు మందులను వాడుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఈ పురుగు మందులను పిచికారీ చేసే సమయంలో రైతులు మరియు కూలీలా ఆరోగ్యం కూడా పాడవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. పైగా నేల సారం కూడా దెబ్బతింటుంది, తద్వారా దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పురుగు మందుల యొక్క వాడకాన్ని తగ్గించడానికి, మరియు సహజ సిద్ధమైన సాగు ప్రోత్సహించడానికి 'పీఎం-ప్రమాణ్' అనే ప్రత్యామ్న్యాయ పోషకాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సహజ సిద్ధమైన సాగునీ రైతులు ప్రారంభిస్తే కనుక, భూమి యొక్క సారాన్ని పెంచడమే కాకుండా, సాగు ఖర్చు కూడా తాగించుకోవచ్చు అని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి..
పురుగుల మందుల పిచికారీ సమయం లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు..
రాష్ట్రం |
2017-18 |
2018-19 |
2019-20 |
2020-21 |
మహారాష్ట్ర |
15,568 |
11,746 |
12,783 |
13,243 |
ఉత్తరప్రదేశ్ |
10,824 |
11,049 |
12,217 |
11,557 |
పంజాబ్ |
5,835 |
5,543 |
4,995 |
5,193 |
తెలంగాణ |
4,866 |
4,894 |
4,915 |
4,986 |
హర్యానా |
4,025 |
4,015 |
4,200 |
4,050 |
జాతీయ స్థాయి |
63,406 |
59,670 |
61,702 |
62,193 |
పొలాల్లో ఈ క్రిమిసంహారకాలను పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో రైతులకు ఎక్కువగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మన శరీరంపై పడిన రసాయనాల వాళ్ళ వివిధ రకాల చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది అని కొన్ని అంతర్జాతీయ సంతలు పరిశోధనలు చేసి చెబుతున్నాయి. భూసారం తగ్గడం వలన రైతులు పొలాల్లోకి అధికంగా ఎరువుల వాడకాన్ని వాడాల్సివస్తాది. ఇది మల్లి రైతులకు అధిక భారంగా మారుతుంది. కాబట్టి సహజసిద్ధమైన పద్దతిలో సాగు చేయడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి..
Share your comments