వరి నాట్లకు అయ్యే ఖర్చు గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అక్కర్లేదు. వచ్చే ఆదాయం తో పోలిస్తే పంట కోసం పెట్టె పెట్టుబడి ఎక్కువ అన్ని ఖర్చులు పోను చిన్న సన్నకారు రైతులకు మిగిలేది అంతంత మాత్రమే అయితే చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త వరి వంగడం ఒక సరి నాటితే 4 సంవత్సరాలవరకు పంట దిగుబడిని ఇస్తుంది అంటే ఒకసారి నాటు వేస్తే వరుసగా 8 పంటల వరకు నాటు వేయకుండా పంటను పండించవచ్చు .
ఇప్పటికే చైనాలో అక్కడి రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు . 'పీఆర్-23' Perennial Rice పేరుతో ఈ వెరైటీ వరి రకాన్ని చైనాలోని యున్నాన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
చైనాకు సంబందించిన సాధారణ రకం ఒర్జ్యా సతివా రకం వరిని ఆఫ్రికాకు చెందిన మరో రకం వరిని సంకరం చేసి 'పీఆర్-23'ని అభివృద్ధి చేసారు . ఈ వరిని ఒక్కసారి నాటితే చాలు.. కనీసం నాలుగేళ్లు, ఎనిమిది సార్లు వరి కోతకు వస్తుంది. పైగా సాధారణ వరితో పోలిస్తే దిగుబడి కూడా ఎక్కువే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు .ఎకరాకు సుమారుగా 2 టన్నుల వరి పండుతుంది . అంతేకాదు ఈ పంటకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి నాటువేస్తే.. మరో ఏడు పంటల వరకు నాట్లు వేయాల్సిన ఖర్చు తగ్గుతుంది. కూలీల సమస్య ఉండదు. ప్రతిసారీ విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. అలాగే రసాయనాలు కూడా పెద్దగా వాడాల్సిన అవసరం ఉండదు.
తెలంగాణ: వానాకాలం లో 38.06 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ !
సాధారణ వరి పంటలతో పోలిస్తే ఇది ప్రతి సంవత్సరం దిగుబడిని పెంచుకుంటూపోతుంది , ప్రతి సంవత్సరం ఈ పంట వేళ్ళు లోతుగ చొచ్చుకొని పోతాయి తద్వారా ప్రతి సంవత్సరం పంట దిగుబడి పెరుగుతుంది .
Share your comments