Agripedia

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే ముత్యాల సాగు వివరాలు..!

KJ Staff
KJ Staff

భారతీయ సాంప్రదాయంలో ముత్యాల ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి సిద్ధమైన నవరత్నాల్లో ముత్యం ఒకటి. మేలి రకం ముత్యాలతో తయారుచేసిన వివిధ రకాల ఆభరణాలను ధరించడానికి భారతీయ మహిళలతో పాటు విదేశీ మహిళలు కూడా ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. అందుకే విదేశీ మార్కెట్లో మన భారతదేశంలో ఉత్పత్తి అయిన ముత్యాలకు, ముత్యాల ఆభరణాలకు మంచి డిమాండ్ ఉండడంతో ముత్యాల సాగు చేస్తున్న రైతులు సంవత్సరం పొడవునా నిలకడైన ఆదాయాన్ని పొందుతున్నారు.

సహజంగా మేలిరకం ముత్యాలు మొలాస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలో తయారవుతాయి. ముత్యాలు సాధారణంగా మంచి నీళ్లలో ఏర్పడ్డవి, ఉప్పునీటిలో ఏర్పడ్డవి రెండు రకాలు ఉంటాయి. చూడ్డానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ వాటి నాణ్యతలోను, రంగుల్లోను కొంత తేడా ఉంటుంది. ముత్యాల సాగుకు మొదట సముద్రాలు మరియు నదుల నుంచి
ఆల్చిప్పలను సేకరించిన తరువాత వాటికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తారు.

తర్వాత ఆల్చిప్పలను జాగ్రత్తగా తెరిచి అందులో క్యాల్షియం కార్బోనేట్‌తో చేసిన పూసల్ని పెడతారు. అవి ముత్యపు కేంద్రకంగా పనిచేస్తాయి. అలా క్యాల్షియం కార్బోనేట్‌ అమర్చిన ఆల్చిప్పలను రంధ్రాలు ఉన్న ట్రేలో పెట్టి మంచి నీటితో నింపిన తొట్టెల్లో ఉంచుతారు
తొట్టెలో నీటి ఉష్ణోగ్రత 15-25 డిగ్రీల సెల్సియస్‌
ఉండునట్లు ఏర్పాటు చేసుకోవాలి.కొన్ని రోజులకు ముత్యాల సాగుకు అనువుగా ఏర్పాటు చేసుకున్న చెరువులు,నీటి సంపుల్లో వీటిని ఉంచి వీటికి ఆహారంగా సముద్రపు నాచు ఇస్తూ అప్పుడప్పుడు నీళ్లను మారుస్తూ తగిన ఉష్ణోగ్రత ను కల్పించినట్లు అయితే దాదాపు 18 నెలలకు సహజ సిద్ధమైన ముత్యాలు ఏర్పడతాయి. అధిక నాణ్యమైన ముత్యపు ధర ప్రస్తుత మార్కెట్లో దాదాపు 1500 నుంచి 2 వేల రూపాయల వరకు ఉంటుంది.

Share your comments

Subscribe Magazine