దేశంలో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న వాణిజ్య నూనె గింజల పంటల్లో వేరుశెనగ ముఖ్యమైనది
సాధారణంగా వేరుశనగ పంటను రైతులు జూలై నెల వరకు వేసుకోవచ్చు.ఒకవేళ వర్షాలు రాక ఆలస్యమైతే ఆగస్ట్15వ తేదీ వరకు విత్తుకోవచ్చు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో చాలా మంది రైతులు వేరుశెనగ సాగు చేపట్టారు ఈ నేపథ్యంలో వేరుశనగ సాగులో చేపట్టాల్సిన
అంతరకృషి, ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరువుల వేసే సమయం, మోతాదు :
భూసార పరీక్షను అనుసరించి ఎరువుల రకాలు మోతాదును నిర్ణయించుకోవడం మంచిది. సాధారణంగా ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 -5 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు,100 కి లోల సూపర్ ఫాస్ఫేట్, 200కిలోల యూరియా,35 కి లోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. పూత దశలో లేదా కలుపు తీసే ముందు ఎకరానికి 200 కిలోల జిప్సం వేసుకుంటే బెట్ట పరిస్థితులనూ అధిగమించి నాణ్యమైన గింజలు వస్తాయి.
కలుపు నివారణ, అంతరకృషి :
కలుపు సమస్య తీవ్రంగా ఉన్న భూముల్లో వేరుశనగ విత్తిన 48 గంటల లోపు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటికి 1 లీ. పెండిమిథాలిన్ కలిపి నేలపై పిచికారి చేస్తే 25 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు.విత్తిన 25 రోజుల తర్వాత వెడల్పు ఆకులు గల కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫిర్ 10% లేదా ఇమాజీమాక్స్ 35% కలుపు మందును 40 గ్రా. ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చు. సాధ్యమైనంతవరకు కలుపు మొక్కలను అంతర కృషి ద్వారా నివారించడమే మంచిది.
Share your comments