ఇప్ప పళ్ళ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ పళ్ళు దట్టమైన ఆటవి ప్రాంతాల్లో దొరుకుతాయి, ఇప్ప చెట్టును గిరిజనుల యొక్క కలపవల్లిగా భావిస్తారు. ఇప్ప పూలు సువాసనలు వెదజల్లడమే కాకుండా ఎంతోమంది ఆదివాసీలకు జీవనోపాధిగా నిలుస్తున్నాయి. ఈ చెట్టు యొక్క పళ్ళు మరియు పూలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ చెట్ల సాగు పెంచేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) కృషి చేస్తుంది.
ఇప్ప సాగు చేపట్టడం, ఎంతో లాభదాయకమని ఐసిఏఆర్ రైతులకు సూచిస్తుంది. సాగు విస్తీరణం పెంచేందుకు, అధిక దిగుబడులిచ్చే 'థార్ మధు' అనే రకాన్ని అభివృద్ధి చేసింది. వర్షాలు తక్కువగా పడే ప్రాంతాల్లో కూడా మంచి దిగుబడులు అందించే విధంగా ఈ రకాన్ని అభివృద్ధి చెయ్యడం జరిగింది. 2016 లో ఈ రకాన్ని గుర్తించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అరిడ్ హార్టికల్చర్ సంస్థ ఈ రకాన్ని అభివృద్ధి చేసి, సాగుకి అనుకూలంగా తయారుచేసారు. మధు రకం పూత, దిగుబడి, మరియు నాణ్యతలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుంది. ఈ రకం యొక్క ప్రత్యేకతలు మరియు సాగు విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
థార్ మధు రకం సుమారు 4.46 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. 72.71 వేరు కాండం చుట్టూ కొలతతో ఉండే ఈ చెట్టులో ఆకులు దీర్ఘవృత్తాకారంగా, లేదా, దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. వీటిని కొమ్మకత్తిరింపుల ద్వారా వృద్ధి చేస్తారు, ఇలా పెంచిన మొక్కలు 5 వ సంవత్సరం నుండి పూలు పూయడం ప్రారంభమవుతుంది. థార్ మధు మేలో పండిన పండ్లను ఉత్పత్తి చేస్తుంది. తాజా పువ్వులు బ్రిక్స్ TSS 26.63°, 1.03% ఆమ్లత్వం, 23.11% మొత్తం చక్కెర మరియు 58.61 mg/100g విటమిన్ సి కలిగి ఉంటాయి. పొడి పువ్వుల దిగుబడి మొక్కకు దాదాపు 6.32 కిలోలు. పండ్ల సగటు బరువు 29.00 గ్రాములు, 41.74% గుజ్జు, బ్రిక్స్ TSS 14.26°, 0.10% ఆమ్లత్వం, 10.80% మొత్తం చక్కెర, మరియు 48.38 mg/100g విటమిన్ సి. పండ్ల దిగుబడి ఒక్కో మొక్కకు 20.14 కిలోల వరకు చేరుకుంటుంది. వర్షాధార పరిస్థితుల్లో 10వ సంవత్సరం.
రాతి, కంకర ఎర్ర నేలలు మరియు సెలైన్ లేదా సోడిక్ నేలలతో సహా వివిధ రకాల నేలల్లో ఇప్ప చెట్లు వృద్ధి చెందుతాయి. సరైన పెరుగుదలకు, బాగా ఎండిపోయిన, లోతైన లోమ్ నేలలు అనుకూలమైనవి. మొక్కలు నాటేందుకు ముందుగా 90 సెంటీమీటర్ల, వెడల్పు, లోతు కలిగిన గుంతలు తవ్వుకొని వాటిలో, పశువుల ఎరువు మరియు 5 కిలోల NPK వేసి వాటిలో మొక్కలను నాటుకోవాలి. మొక్కలు ఎదిగే దశలో ఉన్నపుడు గడ్డితో మూల్చింగ్ చెయ్యడం ద్వారా, భూమిలోని తేమ నిలిచి ఉండటమే కాకుండా, కలుపును కూడా కొంత వరకు నివారిస్తుంది. ఇప్ప చెట్లు తక్కువ నీటి లబ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా సులభంగా పెరుగుతాయి, అయితే మొదటి రెండు సంవత్సరాలు మాత్రం, అప్పుడుడప్పుడు నీటి తదులివ్వడం ద్వారా మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు అందించడానికి ఆస్కారం ఉంటుంది.
ఇప్ప చెట్లు నాటిన ఐదు సంవత్సరాల నుండి దిగుబడి ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఇప్ప చెట్లు సాధారణంగా మే మరియు జూన్ నెలల్లో పూలు పుయ్యడం ప్రారంభమవుతుంది. నేలపై రాలిన పూలను సేకరించి వాటిని ఎండబెట్టి విక్రయించుకోవచ్చు. అయితే ఈ పూలను ఎండబెట్టడానికి తేమ నిల్వ ఉండని పొడి ప్రదేశాల్లో నిల్వ చెయ్యడం మంచిది. రక్తహీనత ఉన్నవారికి వీటి నుండి తయారుచేసిన లడ్డులు తినిపించడం ద్వారా తిరిగి మళ్ళి రక్తం రక్తం పడుతుంది. అలాగే ఈ పులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Share your comments