వేసవి కాలం రాగాన అందరూ ఎంతగానో ఎదురుచూసేది మామిడి పండ్లకోసమే, పండ్లలో రారాజుగా మామిడిపండ్లను పరిగణిస్తారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ మామిడి పండ్లను తినడానికి ఇష్టపడతారు. మామిడి పంటను మన రెండు తెలుగురాష్ట్రాల్లో అధికంగా సాగు చేస్తారు. మామిడి రైతులు ప్రధానంగా ఎదురుకునే సమస్య పిందె రాలుట. పిందె రాలటాన్ని ముందుగానే నియంత్రించకపోతే మామిడి సాగులో అధిక నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది. మామిడిలో పిందెలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకంటే మామిడి చెట్లలో పూత రాలడం అధికంగా ఉంటుంది. 1000 పువ్వులకు గాను ఒకటి లేదా రెండు మాత్రమే పిందెలుగా మారతాయి.
పిందె రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా, పత్రికుల వాతావరణం, చెట్టులో హార్మోన్ల లోపం, చీడపీడలు, పోషకాల లోపం ఏమైనా పిందె రాలటానికి కారణం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమగ్ర నిర్వహణ చర్యలు చేపట్టడం ద్వారా మామిడి పిండే రాలడాన్ని నియంత్రించవచ్చు.
పత్తి పంటలో తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ
ప్రతికూల వాతావరణం: మామిడి పూత దశ నుండి కాయగా మారేంతవరకు, వాతావరణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మామిడి పిందె దశలో ఉన్నపుడు, వాతావరణంలో హెచ్చుతగ్గులు ఉంటె పిందె అధికంగా రాలడానికి అవకాశం ఉంటుంది. పగటిపుట మరియు రాత్రి పుట ఉష్ణోగ్రతల్లో ఎక్కువ తేడా ఉంటె మామిడి చెట్టుపై అధిక ఒత్తిడి పడి పిందె రాలడం ఎక్కువ అవుతుంది. పిందే పచ్చ రంగులో ఉన్నపుడే రాలి కింద పడితే, వాతావరం ఒత్తిడి వల్లే పిందె రాలింది అని నిర్ధారించవచ్చు. అలాగే సాగు నీటి యాజమాన్య చర్యల్లో లోపల వల్ల కూడా పిందె రాలే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. కాబట్టి, పిందె దిశలో చెట్టుకు అవసరమైనంత నీటిని అందించాలి. వాతావరణం ద్వారా కలిగే స్ట్రెస్ నుండి చెట్టుని రక్షించి, పిందె రాలడాన్ని తగ్గించడం కోసం ఒక ఎకరానికి 30 గ్రాముల గిబ్బెర్లిక్ ఆసిడ్+ ఒక కేజీ సివీడి బిందు సేద్యం పద్ధతిలోకాని, కాలువల ద్వారా వెళ్ళే నీటిలో కలిపి మొక్కలకు అందించాలి.
పోషకాల లోపం: చెట్టుకు అవసరమైన పోషకాల్లో లోపం ఏర్పడటం వల్ల కూడా పిందె రాలిపోవచ్చు. కనుక చెట్టుకు అవసరమైన పోషకాలను లెక్క ప్రకారం అందించాలి. కాయ పిందె దశలో ఉన్నపుడు ప్రతి చెట్టు మొదల్లో ఒక కిలో యూరియా+ మ్యురేట్ ఆఫ్ పోటాష్, రెండు కిలోల వేపపిండిని వేసి నీటిని అందించడం ద్వారా పిందె రాలడాన్ని అరికట్టవచ్చు.
చీడ పీడల నివారణ: పిందెలు ఏర్పడే సమయంలో అనేక చీడ పీడలు చెట్లను ఆశిస్తాయి. కాయ తొలుచు పురుగు, పండు ఈగ, పిండి పురుగు, భుజు తెగులు, నల్ల భుజు తెగులు, మొదలైనవి ముఖ్యమైన చీడ పీడలు. వీటి నివారణకు, ఒక లీటర్ నీటికి, రెండు మిల్లి లీటర్ల ప్రోపోనిల్+ మూడు మిల్లి లీటర్ల హెక్సకోనోజోల్ కలిపి అన్ని చెట్లపైనే పిచికారీ చెయ్యాలి. అలాగే కొమ్మలకు లైట్ ట్రాప్స్, స్టిక్కీ ట్రాప్స్ వాడటం ద్వారా పండు ఈగలను నియంత్రించవచ్చు.
Share your comments