ఒక చిన్న జపనీస్ తర్భూజా కొనాలంటే ఎంత ధర పెట్టాలో మీకు తెలుసా? రెండు వందల అమెరికన్ డాలర్లు అంటే సుమారు పదిహేను వేల రూపాయలు అన్నమాట. ఒక్క పండు అంత ధరా అని ఆలోచిస్తున్నారా? అవును..
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. దీన్ని పండించాలంటే ఎలాంటి అద్భుతమైన పద్ధతులు పాటించాలో.. లేక ఇందులో ఎన్ని పోషకాలు నిండి ఉంటాయో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. అందుకే ఈ పంటపై కనీసం పది సంవత్సరాల పాటు ఈ మొక్కలపై రీసర్చ్ చేస్తూ ప్రయోగాలు చేస్తూ ఈ పండును పండించేందుకు తగిన పద్ధతులను తెలుసుకున్నారు. ఇవి కెమికల్ ఫర్టిలైజర్స్, ఖరీదైన పంట పద్ధతులు మాత్రం కాదు.. ఇవి పండించేందుకు ఉపయోగపడేవి చక్కటి సంగీతం మంచి మసాజ్ అట.
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం ఇలా సరైన పద్ధతిలో సరైన పోషకాలు, సరైన రుచితో ఈ తర్భూజాలు అదే మోనో ప్రీమియం మెలన్ పడించేందుకు వారు పాటించే పద్ధతులేంటో తెలుసా? రోజూ మెత్తని వస్త్రం లేదా గ్లవ్ సాయంతో ఆ పండ్లను రోజూ మసాజ్ చేసేవారట ఈ రైతులు. ఈ ప్రాక్టీస్ ని టమా ఫుకీ అని పిలుస్తారట. ఈ పద్ధతిని పాటించడం వల్ల తర్భూజాలోని ఫ్లేవర్ పెరుగుతుందట. అంతేకాదు.. ఈ కాయలు సైజు పెరిగి మంచి రంగులో రావడానికి గ్రీన్ హౌజ్ లలో వీటిని పెంచే చోట క్లాసికల్ మ్యూజిక్ ని ఏర్పాటు చేశారు.
జపనీస్ మస్క్ మెలన్ పెంపకం కోసం పాటించే పద్ధతులను గురించి వివరిస్తూ మోనో సంస్థ డైరెక్టర్ కో ఫౌండర్ సెహ్ చెంగ్ "ప్రతి జపనీస్ మెలన్ ఒక ఆర్ట్ పీస్ లాంటిది. ప్రపంచంలోనే అత్యద్భుతమైన రుచి కోసం ఈ తర్భూజాలు ఫేమస్. దీన్ని చాలామంది లగ్జరీ ఐటమ్ గా భావిస్తుంటారు" అని వెల్లడించారు. ఈ సంస్థకు మలేషియా లోని పుత్రజయలో పెద్ద ఫార్మ్ ఉంది. జపనీస్ రైతులు దీన్ని పండించేందుకు కొన్ని ఏళ్ల పాటు ప్రయత్నించి ఈ పద్ధతిలో పర్ఫెక్షన్ సాధించారు. ఇవి కేవలం ఖరీదైన స్టోర్లలో మాత్రమే లభిస్తాయి. జపాన్ వాతావరణం వీటికి చక్కగా నప్పేది. కానీ మలేషియాకి చెందిన రైతులు మిగిలిన పద్ధతులన్నింటితో పాటు ఎండ, తేమ ఎక్కువగా ఉన్న వాతావరణాన్ని కూడా తట్టుకునేలా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
అయితే మలేషియాలో వీటిని పెంచడం అస్సలు సులభం కాలేదు. ఈ పద్ధతి గురించి సెహ్ వెల్లడిస్తూ "వీటిని పంచేందుకు ముందు పది వెరైటీల తర్భూజాలు పండించాల్సి వచ్చింది. మా రైతులు జపాన్ కి కూడా వెళ్లి అక్కడి రైతులు పాటించిన పద్ధతులను స్టడీ చేశారు. ఆ తర్వాత వాటిని మలేషియాలో పాటించారు. అందులోని పోషకాలు అదే రకంగా ఉండేలా నీళ్లు, ఎరువులు సరైన మోతాదులో మాత్రమే అందించారు." అని వెల్లడించారు.
వీరు గత పదేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు ఫలించి ఈ పండ్లు మంచి రుచిని, రంగును, షేప్ ని సంతరించుకోవడం ప్రారంభమయ్యాయి. వీరి మొదటి బ్యాచ్ గా అమ్మిన రెండు వందల తర్భూజాలు కొన్ని గంటల్లో అమ్ముడయ్యాయి. అయితే జపాన్ తర్భూజాల కంటే ఇవి కాస్త తక్కువ ధరలకు అమ్ముడుపోవడం గమనార్హం. ఈ తర్భూజాలు ఆన్ లైన్ లో 168 రింగిట్లు ( రూ. 3035) లకు అమ్ముడుపోయాయి. అయితే ఇది కేవలం మొదటి బ్యాచ్ మాత్రమే కావడంతో త్వరలో మరిన్ని పండించి మంచి గిట్టుబాటు ధరలకు అమ్మాలని వీరు నిర్ణయించుకున్నారు.
https://krishijagran.com/agripedia/muskmelons-from-persia-usability-propagation-and-much-more/
https://krishijagran.com/agripedia/grow-muskmelon-and-earn-more/
Share your comments