Agripedia

లిల్లీ పూల సాగులో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు...!

KJ Staff
KJ Staff

తెల్లటి వర్ణంతో సువాసనలు వెదజల్లే లిల్లీ పూలకు ప్రస్తుతం మార్కెట్లో అధిక డిమాండ్, నిలకడైన ధర లభిస్తుండటంతో చాలా మంది రైతులు లిల్లీ పూల సాగు వైపు అడుగులు వేస్తున్నారు.సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే లిల్లీ పూల సాగును జూలై, ఆగస్టు నెలలో నాటేందుకు అనుకూలంగా ఉంటుంది.సమశీతోష్ణ స్థితి కలిగిన వాతావరణ పరిస్థితుల్లో మొక్కలు చక్కగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి.

లిల్లీ పూలలో సింగిల్, డబుల్, సెమిడబుల్, మరియు వెరిగేటెడ్ అనే రకాలు బాగా ప్రాచుర్యం పొంది రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.లిల్లీ మొక్కలను నాటు కొనేటప్పుడు వరుసల మధ్య 20-30 సెం.మీ. మరియు మొక్కల మధ్య 10-20 సెం.మీ. ఉండేటట్లు 2-3 -సెం.మీ. వ్యాసం కలిగి దుంపల ను నాటుకుంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగి అధిక దిగుబడులను పొందవచ్చు. నాటిన 90-110 రోజుల తరువాత పూతకు వస్తుంది.

ఎరువుల యాజమాన్యం: ఆఖరి దుక్కిలో బాగా చివికిన పశువుల ఎరువుతోపాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ను ఎకరాకు 85 కిలోల చొప్పున వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం దుంపలు నాటిన 30 రోజులకు, 60 రోజులకు మరియు 90 రోజులకు తగిన మోతాదులో మూడు దఫాలుగా వేసుకోవాలి. అలాగే నేల స్వభావము వాతావరణ పరిస్థితులను బట్టి సూక్ష్మపోషకాలైన జింక్ సల్ఫేట్ 0.5 శాతం + ఫెర్రస్ సల్ఫేట్ 0.2 శాతం + బోరిక్ ఆమ్లం 0.1 శాతం మొక్కల మీద పిచికారి చేసినట్లయితే నాణ్యమైన పూల దిగుబడిని పొందవచ్చు.

సస్యరక్షణ చర్యలు:

లిల్లీ పూల సాగులో వివిధ దశల్లో వివిధ రకాల
పురుగులు, తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తాయి.
ముఖ్యంగా నులి పురుగులు,మొగ్గ తొలుచు, తామర పురుగులు,మరియు పేనుబంక పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది.

నులిపురుగు: వీటి నివారణకు ప్యూరాడాన్ గుళికలు ఎకరానికి 8-10 కిలోలు భూమిలో తడి ఉన్నప్పుడు వేసి నివారించవచ్చు.

మొగ్గ తొలుచు పురుగు: వీటి నివారణకు గానూ క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా. థయోడికార్బ్ 1 గ్రా. చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

తామర పురుగు మరియు పేనుబంక: వీటి నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. గానీ లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ. గానీ కలిపి పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు,మొగ్గ కుళ్ళు తెగుళ్ళు:
వాతావరణంలో తడి ఎక్కువగా ఉన్నప్పుడు, నీరు నిలిచే నేలల్లో తెగుళ్ళు ఆశిస్తాయి వీటి నివారణకులీటరు నీటికి 5 గ్రాములు కార్బండిజమ్ కలిపి పిచికారి చేసుకుంటే సరిపోతుంది.

Share your comments

Subscribe Magazine