Agripedia

పశువుల్లో వచ్చే లెప్టోస్పిరోసిస్ జ్వరం లక్షణాలు, సంరక్షణ చర్యలు

KJ Staff
KJ Staff

వర్షాకాలంలో పశువుల సంరక్షణ చర్యలు చాలా ముఖ్యం. ఎందుకంటే వానాకాలంలో పాడి పశువులు అనేక రకాల వ్యాధుల బారినపడుతుంటాయి. రకరకాల జ్వరాలు సైతం వస్తుంటాయి. వేసవి కాలం, వానకాలం, చలికాలం ఇలా అన్ని కాలాల్లోనూ పశువులకు వచ్చే వ్యాధుల్లో లెప్టోస్పిరోసిస్ జ్వరం ఒకటి. ఇది బ్యాక్టీరియాల వల్ల వస్తుంది. లెప్టోస్పిరా ఇంట్రోగన్స్ అనే బాక్టీరియం పశువుల్లో ఈ జ్వరానికి కారణం అవుతుంది. ఈ వ్యాధి ప్రభావం అధికంగా అంతర్గతంగా ఉండే అవయవాలపై ఉంటుంది. వ్యాధి లక్షణాలు తక్కువగా కనిపిస్తుంటాయనీ, అయినప్పటికీ పశువుల్లో కనిపించే పలు రకాల లక్షణాలతో దీనిని గుర్తించవచ్చు.

లెప్టోస్పిరోసిస్ జ్వరం పశువులకు సోకడం వల్ల మూగ జీవాల శరీర ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెంటీగ్రేట్ కు పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా అధికంగా ఉంటుంది. (పల్స్ పెరుగుతుంది). ఈ జ్వరం ప్రభావం మరింత అధికంగా ఉంటే పశువుల్లో జ్వరం అధికంగా పెరిగి.. మూత్రం విసర్జించడంలో ఇబ్బందులు పడుతాయి. ఒక్కోసారి రక్తం సైతం మూత్రంతో పడుతుంది. చర్మంపై అక్కడక్కడ గాయాలు అవుతాయి. దీంతో పశువులు తీవ్రంగా నీరసించి.. బలహీనంగా మారుతాయి. ఇలాంటి సమయంలో పశువుల సంరక్షణ కోసం పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. తొలి దశలోనే ఈ రకం జ్వరాన్ని గుర్తించే పశువులకు టీకాలు వేసుకోవాలి. ఈ జ్వరం దూడల్లో కామెర్లకు దారీ తీస్తుంది. పశువుల్లో దీనిని తొలిదశలోనే గుర్తిస్తే.. అమోక్సిలిసిన్ 150 ఇంజక్షన్ ను ఇవ్వాలి. (పశువుల బరువును బట్టి మోతాదు మారుతుంది. దీనిని చర్మం కింద ఇవ్వాల్సివుంటుంది. అలాగే, ప్లోరిడాక్స్ ను మూడు నుంచి ఐదు రోజులకు ఒకసారి ఇవ్వాలి. అలాగే యాంటీబయోటిక్స్ సైతం వాడవచ్చు.

లెప్టోస్పిరోసిస్ జ్వరం పశువులకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది దొడ్లల్లో (పశువులను ఉంచే స్థలంలో) ఎలుకలు లేకుండా చూసుకోవాలి. పశువులకు ఆరు నేలలకు ఒక సారి వివిధ వ్యాధులు తట్టుకునే టీకాలను ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఆ టీకాలు వేయించాలి. పశువులను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. దొండ్లల్లో చెత్త చెదారం, పేడ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం వచ్చిన పశువులను మిగతా వాటికి దూరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇతర పశువులకు ఇది సంక్రమించకుండా ఉంటుంది.

Share your comments

Subscribe Magazine