కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ చిన్న రైతులకు సాధికారత కల్పించడం వల్ల భారతదేశ జిడిపి పెరుగుతుంది.భారతదేశంలో 85% చిన్న సన్నకారు రైతులే ఉన్నారని, పెట్టుబడి కొరత చిన్న మధ్య తరగతి రైతులకు అతి పెద్ద సమస్య అని అయన అన్నారు .
రైతు రుణ సమస్యల నుంచి ప్రజలను తప్పించుకునేందుకు ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో మొత్తం రూ.20 లక్షల కోట్ల స్వల్పకాలిక రుణాలను అందించిందిఅని వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభమని ఆయన చెప్పారు. చిన్న రైతుల ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రూ.6,865 కోట్ల పెట్టుబడితో 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిందని తోమర్ పేర్కొన్నారు.
మైదాన ప్రాంతాల్లో 300 మంది రైతులు ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ ) ఏర్పాటు చేసుకోగలిగితే, కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లో 100 మంది రైతులు ఎఫ్‌పీవోగా ఏర్పడవచ్చు. కొత్త సాంకేతికతలు, మెరుగైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు మరియు పరికరాలను పొందేందుకు, అలాగే క్లస్టర్ ఫార్మింగ్ ద్వారా ఉత్పాదకతను పెంచడానికి FPOలు దోహదం చేస్తాయని అన్నారు .
PM కిసాన్: ఆన్‌లైన్‌లో తప్పులను సవరించుకోండి ఇలా!
ఆత్మనిర్భర్ ప్యాకేజీలో ఉద్యానవనానికి రూ.15,000 కోట్లు, మత్స్య పరిశ్రమకు రూ.20,000 కోట్లు, మూలికా వ్యవసాయానికి రూ.4,000 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రూ.10,000 కోట్లు కేటాయించామని తోమర్ పేర్కొన్నారు . 2013-14లో వ్యవసాయ బడ్జెట్ రూ.21,000 కోట్లుగా ఉందని, ఆ తర్వాత దానిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,25,000 కోట్లకు పెంచిందని వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా 11.5 కోట్ల మంది రైతులకు రూ.2,40,000 కోట్లు పంపిణీ చేశామన్నారు.
Share your comments