Agripedia

మిర్చి సాగుతో లక్షల్లో సంపాదిస్తున్న కర్నూలు రైతులు ..

Gokavarapu siva
Gokavarapu siva

మిరప పంటను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాలలో అధికంగా పండిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో మిర్చి సాగు గమణియంగా పెరిగింది. ఇక్కడి రైతులకు మిర్చిని సాగు చేయడం వలన అధిక లాభాలను పొందుతున్నారు.ఈ మిర్చి సాగులో తెగుళ్ల బెడద ఉన్నపటికీ, వివిధ పద్దతులను పాటిస్తూ తెగుళ్ల సమస్యను అదుపు చేసి ఇక్కడ రైతులు మిర్చి సాగును చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోతలు పూర్తీ అయ్యాయి. ఇక్కడ మరో రెండు కోతలు వచ్చే అవకాశం ఉంది అని రైతులు తెలుపుతున్నారు. ఈ కర్నూలు జిల్లాలో మొత్తానికి 50,395 ఎకరాల్లో సాధారణ సాగు ఉంది, ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా కర్నూలు జిల్లాలో ఏకంగా 1,26,215 ఎకరాల్లో మిర్చిని ఇక్కడ రైతులు సాగు చేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఆలూరు,కోసిగి, మంత్రాలయం, చిప్పగిరి, దేవనకొండ, గోనెగండ్ల, కల్లూరు, హాలహర్వి, దేవనకొండ మొదలగు మండలాల్లో మిర్చి సాగు అనేది అధికంగా ఉంది.

కర్నూలు జిల్లాలో నీటిని వృధాచేకుండా ఉండటానికి, ఇక్కడ మిర్చి పంటలకు బిందుసేద్యం( డ్రిప్ ఇరిగేషన్) సదుపాయాన్ని ఇక్కడ రైతులు ఎక్కువుగా వాడుతున్నారు. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఈ సూక్ష్మ సేద్యం సదుపాయాన్ని కల్పించారు. ఈవిధమైన నీటి సదుపాయాలను రైతులకు అందించడం వలన, ఇక్కడ దిగుబడి అనేది అధికంగా వచ్చింది. ఈ సదుపాయం కల్పించిన పొలాల్లో 25 క్వింటాళ్ల దిగుబడి అనేది వచ్చింది. దానితోపాటు మిర్చి యొక్క నాణ్యత కూడా పెరిగింది.

ఇది కూడా చదవండి..

విదేశాల్లో ఖమ్మం మిర్చికి బారి డిమాండ్

కర్నూలు జిల్లా రైతులు తెగుళ్లను నివారించడానికి వాటిని తట్టుకునే రకాలను సాగు చేయడం మొదలుపెట్టారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తెగుళ్ల బెడద తగ్గి, అధిక దిగుబడులను పొందుతున్నాం అని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మిర్చి సాగు చేయడానికి రైతులు ఎకరానికి రూ.75 వేల నుండి 1.25 లక్షల వరకు పెట్టుబదులు పెడుతున్నారు. ఇక్కడ పండించిన పంటను కర్నూలు మరియు గుంటూరు మార్కెట్ లోకి విక్రయాలు జరుగుతున్నాయి.

నాణ్యత గల రకాలు అయినా తేజ, సింజెంట, ఆర్ముర్ వంటి రకాలను పండించడం వలన మిర్చికి ఎక్కువ ధర పలుకుతుంది. క్వింటాకు రూ.20 వేల నుండి రూ.25 వేల వరకు ధర వస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మిర్చి యొక్క సాగు మరియు దిగుబడి కూడా పెరిగింది.

ఇది కూడా చదవండి..

విదేశాల్లో ఖమ్మం మిర్చికి బారి డిమాండ్

Related Topics

chili crop high profits

Share your comments

Subscribe Magazine