రబీ పంట కాలం పూర్తయితే చాలా మెట్ట భూములన్నీ ఖాళీగానే ఉంటాయి. కానీ అలా ఖాళీగా వదిలేయడం కంటే వేసవిలో దుక్కులు దున్నడం, భూసారాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేయడం వంటి వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
అందుకే వేసవిలో నాగళ్లు, ట్రాక్టర్ల సాయంతో దుక్కులు దున్నడం.. వీలుంటే పచ్చి రొట్ట మొక్కలను పెంచడం వంటివి చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
వేసవి దుక్కుల వల్ల ప్రయోజనాలు
* వేసవి దుక్కులు దున్నడం వల్ల పొలంలో తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
* భూమిలోని గట్టి పొరలు విడిపోయి భూమి గుల్లబారుతుంది. సూక్ష్మ జీవులు, వానపాములు పెరిగి సేంద్రియ పదార్థాలు పెరుగుతాయి.
* కలుపు మొక్కలు నశిస్తాయి. భూమి సారవంతం అవుతుంది. ఈ రెండింటి వల్ల ఎరువులు, పెస్టిసైడ్స్ తక్కువగా ఉపయోగించడం వల్ల లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
* పంటలను ఆశించే చాలా రకాల పురుగులు ఇప్పుడు నిద్రావస్థలో ఉంటాయి. దుక్కుల కారణంగా పైకి వచ్చి పక్షులకు ఆహారం కావడం కానీ లేక ఎండకు మరణించడం కానీ జరుగుతుంది.
* శిలీంధ్ర బీజాలు కూడా భూమి లోపల పొరల నుంచి బయటకు వస్తాయి. ఎంత తీవ్రతను ఇవి కూడా నశిస్తాయి.
* లోతైన దుక్కుల వల్ల లోపలి వరకు భూమి పొరలుగా విడిపోయి మొక్కల వేళ్లు కూడా లోతు వరకు చేరుకునే అవకాశం ఉంటుంది.
* క్షారాలు, లవణాలు భూమి లోపలి పొరలకు చేరుకొని పై భాగం సరైన పీహెచ్ తో ఉంటుంది.
* గత పంటకు సంబంధించిన మొక్కలు, వేళ్లు భూమిలో కుళ్లిపోయి ఎరువుగా మారతాయి.
* ఎలుకల బెడద కూడా తగ్గుతుంది.
* గత పంటకు చెందిన అవశేషాలు, మొక్కల వేర్ల ద్వారా ఏవైనా విష పదార్థాలు విడుదలై ఉంటే అవి పూర్తిగా నాశనమవుతాయి.
* వాలుకు అడ్డుగా దుక్కులు దున్నడం వల్ల నేల కోతకు గురి కాకుండా ఉంటుంది.
లోతైన దుక్కుల వల్ల లోపలి వరకు భూమి పొరలుగా విడిపోయి మొక్కల వేళ్లు కూడా లోతు వరకు చేరుకునే అవకాశం ఉంటుంది.
* క్షారాలు, లవణాలు భూమి లోపలి పొరలకు చేరుకొని పై భాగం సరైన పీహెచ్ తో ఉంటుంది.
* గత పంటకు సంబంధించిన మొక్కలు, వేళ్లు భూమిలో కుళ్లిపోయి ఎరువుగా మారతాయి.
* ఎలుకల బెడద కూడా తగ్గుతుంది.
* గత పంటకు చెందిన అవశేషాలు, మొక్కల వేర్ల ద్వారా ఏవైనా విష పదార్థాలు విడుదలై ఉంటే అవి పూర్తిగా నాశనమవుతాయి.
* వాలుకు అడ్డుగా దుక్కులు దున్నడం వల్ల నేల కోతకు గురి కాకుండా ఉంటుంది.
* వేసవిలో దుక్కులు దున్నకుండా నేలను అలాగే వదిలేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగిపోతాయి. ఇవి నేలలోని నీటిని, పోషకాలను లాగేస్తాయి. పంట సమయానికి భూమిని నిస్సారంగా మారుస్తాయి. దుక్కులు దున్నడం వల్ల వీటి బెడద తగ్గుతుంది.
* ముందుగానే దుక్కి దున్ని ఉంచుకోవడం వల్ల వర్షాలు ప్రారంభం కాగానే ఖరీఫ్ పంటలు వేసుకోవచ్చు.
దుక్కులు ఎలా దున్నుకోవాలి?
వేసవిలో కురిసే అకాల వర్షాలను ఉపయోగించుకొని నేల తడిగా మారిన తర్వాత కనీసం 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతుకు దుక్కి దున్నుకోవాలి. ఈ దుక్కుల కోసం ప్రత్యేకంగా రెక్క నాగలి లేదా పల్లపు నాగలి ఉపయోగించుకోవాలి. మెషినరీతో దున్నాలంటే డిస్క్ టిల్లర్, రొటవేటర్ ఉపయోగించాలి. రెక్కల నాగలి పైకి వచ్చిన మట్టి పెళ్లలను కూడా పొడిగా మార్చేస్తుంది. రాళ్లు ఎక్కువగా ఉన్న చోట పల్లెపు నాగలి ఉపయోగించాలి. దుక్కి సమయంలో మట్టి పెళ్లలు లేస్తే దంతె సేద్యం ద్వారా పొలాలు చదును చేసుకోవాలి. దీనివల్ల గతంలోని పంట అవశేషాలు కూడా బయటకు వచ్చేస్తాయి. అంతే కాదు.. వర్షపు నీరు కూడా భూమిలోకి తొందరగా ఇంకుతుంది. తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. నీరు పారి భూమి కోతకు గురి కాకుండా నేలను వాలుకు అడ్డంగా దున్నాలి. దుక్కులు దున్నేటప్పుడే అందులో చెరువు మట్టి కలిపి దున్నుకోవడం, కంపోస్ట్ తో పాటు పచ్చి రొట్ట ఆకులు కలపడం వల్ల అవి మురిగి ఎరువుగా మారతాయి.
చూశారుగా.. వేసవిలో ఖాళీగా ఉన్న పంట పొలాలను దుక్కి దున్ని వదిలేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. చిన్న పని మీ ఆదాయాన్ని ఎంతగానో పెంచుతుంది. మీ శ్రమను ఎంతో తగ్గిస్తుంది. అందుకే వేసవిలో దుక్కులు దున్నుకోవడం మర్చిపోవద్దు.
Share your comments