Agripedia

KHARIF 2022: వర్షాకాలం పంటలకై తెలంగాణ ప్రభుత్వం ప్రణాలిక పత్తి పంటకి పెద్దపీట

S Vinay
S Vinay

ప్రస్తుతం జైద్ పంట కాలం నడుస్తుంది. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం(KHARIF SEASON ) పంట కాలం రాబోతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

వర్షాకాలం పంటల కై త్వరలోనే క్షేత్ర స్థాయిలో పర్యటించి వివిధ కార్యక్రమాలు నిర్వహించి రైతులలో మరింత అవగాహనా మరియు వ్యవసాయం లో మరిన్ని మెళకువలు తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం పంటలలో రైతులు వరిని విస్తారంగా పండిస్తున్న సంగతి తెలిసిందే, దీనిలో కొన్ని మార్పులు తీసుకువస్తు ఈ సారి పత్తి పంటని రైతులు పెద్ద ఎత్తున సాగు చేసే విధంగా తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రోత్సాహ కార్యక్రమాలు చేపట్టనుంది.

తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో పత్తి, సుమారుగా 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కందిని మరియు 11.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించే అవకాశం ఉంది.వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పత్తి సాగును ప్రోత్సహించేందుకు 1,332 క్లస్టర్లు, వరి సాగుకు 1,000 క్లస్టర్లను వ్యవసాయ శాఖ గుర్తించింది.

వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఖరీఫ్‌ పంటలు సాగుచేయడానికి నాణ్యమైన విత్తనాలను ముందుగానే సరఫరా చేయాలనీ క్షేత్రస్థాయిలో పర్యటించి నకిలీ విత్తనాల తనిఖీలు చేపట్టాలని సూచించారు.

ఇంకా మాట్లాడుతూ మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి క్లస్టర్ల వారీగా పంటల ప్రణాళికలపై రైతులకు అవగాహన కల్పించాలని, జిల్లాల వారీగా ప్రణాళికలపై వ్యవసాయ విస్తరణ అధికారులకు(agriculture extension officer) శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అంతే కాకుండా మే నెలాఖరు నాటికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని చదవండి.

తీవ్ర పంట నష్టాన్ని కలుగజేస్తున్న తామర పురుగులని ఇలా నివారిద్దాం.

Share your comments

Subscribe Magazine