Agripedia

దొండ సాగులో వివిధ దశల్లో వచ్చే తెగుళ్లు నివారణ చర్యలు..!

KJ Staff
KJ Staff

తీగజాతి కాయకూర అయినా దొండకాయకు మార్కెట్లో అధిక ధర లభిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ నిలకడైన ఆదాయాన్ని ఏడాది పొడవునా పొందుతున్నారు. శాశ్వత పందిర నిర్మాణానికి ఒకసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి దొండ సాగు చేస్తూ అధిక లాభాలను పొందవచ్చు. దొండ సాగుకు నీరు నిలవని అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. దొండ సాగుకు వివిధ దశల్లో అనేక రకాల వ్యాధులు, పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్నందున తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చునని.

విత్తన శుద్ధి: దొండ మొక్కలను కొమ్మలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు.ఇందులో చూపుడు వేలు లావు ఉన్న నాలుగు కనుపులు గల కొమ్మలను రెండు సెంటీమీటర్ల లోతులో నాటాలి. నాటే సమయంలో విత్తన శుద్ధికి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరమ్ ఒకసారి అరగంట విరామం అనంతరం ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఒకసారి కలిపి శుద్ధి చేయాలి.

సస్యరక్షణ చర్యలు:

వెర్రి తెగులు : ఈ తెగులు సోకితే మొక్కఆకుల, ఈనెల మధ్య చారలు ఏర్పడి పెలుసుగా మారి గిడసబారిపోయి దీంతో పూత, పిందె ఆగిపోయి దిగుబడులపై ప్రభావం చూపిస్తుంది. దీని నివారణలో భాగంగా తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. వెర్రి తెగులు వ్యాప్తికి కారణమయ్యే బరక పురుగులను నివారించడానికి రెండు మిల్లీ లీటర్ల డైమిథాయేట్ లేదా మిథైల్ డెమటాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

బూడిద తెగులు: బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. వాతావరణంలో తేము ఎక్కువగా ఉండి వేడి వాతావరణంలో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుంది.నివారణకు డైనోక్యాప్ ఒక మిల్లీలీటరు, ఒక లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

పండు ఈగ(ఫ్రూట్‌ఫ్లై) :దొండ కాయలు పక్వానికి వచ్చిన తరువాత కాయలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. నివారణకు తోటలను ఎప్పటికప్పడు శుభ్రంగా వుంచుకోవాలి. దీని నివారణలో భాగంగా మిథైల్ యుజినల్ ఎర బుట్టలను వుపయోగించి ఆకర్షింపబడిన మగ పురుగులను నాశనం చేయాలి.

వేరు కుళ్లు తెగులు: ఈ తెగులు సోకితే దొండ తీగలు అకస్మాత్తుగా పండిపోయి ఆకులు వాడిపోతాయి. భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఈ తెగులు పైరు అన్ని దశలలో కనపడుతుంది. దీని నివారణకు బొర్డోమిశ్రమం ఒక శాతం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు లీటరు నీటికి మూడు గ్రాముల కలిపి ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. దీనిని పది రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు చేయాలి. లేదా ఆఖరి దుక్కిలో వేపపండి 250 కిలోలు ఎకరాకు వేసి కలియదున్నాలి. పంట వేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను భూమిలో పాదుల దగ్గర వేయాలి.

Share your comments

Subscribe Magazine