భారతదేశంలో పండించే అతి ముఖ్యమైన వాణిజ్య పంటల్లో పత్తికి ప్రముఖ స్థానం కలదు.పత్తిని సాధారణంగా తెల్ల బంగారం అని కూడా అంటారు. భారతదేశంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లక్షల మంది కార్మికులు పత్తి అనుబంధ రంగాల పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల పత్తి సాగులో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తిలో మాత్రం కొంత వెనుకబడిన ఉందని చెప్పాలి.
పత్తి సాగుకు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు అత్యంత అనుకూలం. పత్తి సాగులో పువ్వు ప్రారంభదశ, పువ్వు వికసించు దశ ,కాయ అభివృద్ధి దశ ఈ మూడు దశలు కీలకమైనదిగా చెప్పవచ్చు. ఈ దశలో సరైన నీటి యాజమాన్యం, అంతరకృషి చేపట్టినట్లు అయితే పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించ వచ్చు.ముఖ్యంగా ఈరోజుల్లో కూలీల కొరత అధికంగా ఉండడంతో సరైన సమయంలో కలుపు నివారణ చర్యలు చేపట్టడానికి ఇబ్బందిగా మారింది. దీంతో పంట దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కలుపు నివారణ, అంతరకృషి: విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీ. లేదా అలాక్లోర్ 50% 1.5 నుండి 2.5 లీటర్లు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తిన 25,30 రోజులప్పుడు మరియు 50-55 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకలతో అంతరకృషి చేయాలి. ఖరీఫ్ లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతరకృషి కుదరనప్పుడు ఎకరాకు లీటరు పెరాక్వాట్ 24% 200లీ. నీటిలో కలిపి ప్రత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేసుకుంటే కలుపు సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చు.
Share your comments