Agripedia

ఆహార భద్రత సుస్థిర వ్యవసాయంతోనే సాధ్యం.....

KJ Staff
KJ Staff
Protect Nature by Sustainable Farming Practices
Protect Nature by Sustainable Farming Practices

ప్రపంచ జనాభా స్థిరవేగంగా పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత దేశంలో ఒకానొక సమయంలో, ఆహార కొరత ఏర్పడినప్పుడు హరితవిప్లవం అభ్యున్నతి సాధించి ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం మొత్తానికి ఆహారం ఉత్పత్తి చెయ్యడం సాధ్యపడింది.

ఒక రకంగా హరితవిప్లవం దేశ ప్రజలను ఆకలి చావుల నుండి రక్షించి, అదేసమయంలో మన ఆహారంలోకి హానికారక రసాయనాలను కూడా చేర్చింది. నేడు ఎంతో మంది భారతీయులు కాన్సర్ వ్యాధితో భాదపడటానికి ప్రధాన కారణం ఈ రసాయన ఎరువులు మరియు పురుగుమందులు. ఈ పరిస్థితిని మార్ఛి, ఆహారనాణ్యతను పెంచి, వ్యవసాయాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగేది సుస్థిర పద్దతులతో కూడుకున్న వ్యవసాయం మాత్రమే.

అయితే శాస్త్రీయ సుస్థిర వ్యవసాయ పద్దతులతో ఇంత మంది జనాభా ఆకలి తీర్చడం సాధ్యమా? అంటే అది కష్టతరమనే చెప్పాలి. కాని అత్యంత వేగంగా పురోగతి చెందుతున్న సాంకేతికతను వ్యవసాయంతో అనుసంధానించడం ద్వారా ఆహార భద్రతను సాధించవచ్చు.

ప్రస్తుతం మనం ఆచరిస్తున్న వ్యవసాయ పద్దతులు ద్వారా పర్యావరణకి హానికలిగించడమే కాకుండా, ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వనరులు కూడా వృధాగా పోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే, చర్యలు చేపట్టడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. కుత్రిమ మేధా పరిజ్ఞానం వ్యవసాయ సాధికారతకు కారణం కాగలదు.భారత దేశంలోని చాల ప్రైవేట్ కంపెనీలు, వ్యవసాయ విధానాలకు తగ్గట్టుగా కుత్రిమ మేధతో పనిచేసే వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. రైతులు వీటిని వినియోగించడం ద్వారా పంటకు తగిన పద్దతులను ఆచరించవచ్చు. కుత్రిమ మేధా సహాయంతో నీటి వినియోగం, ఎరువుల వినియోగం అవసరమైన పరిమితిలో మాత్రమే వినియోగించడతాయి, తద్వారా అధిక వినియోగం నియంత్రించబడి రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది.

ఇప్పటికే చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో కూడా సేంద్రీయంగా పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు, సాధారణ ఉత్పత్తులకంటే అధిక ధరలో లభిస్తుంది. కాకపోతే ఈ సేంద్రియ ఉత్పత్తులు, ఆర్ధికంగా బలంగా ఉన్నవారుకి చేరువలో ఉన్నాయి, మధ్య మరియు పేద తరగతుల ప్రజలు వీటి లభ్యతకు ఇంకా దూరంగానే ఉన్నారు. ప్రభుత్వం, రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మార్చడంలో విజయం సాధించిన, సేంద్రియ ఉత్పత్తులను అన్ని వర్గాల ప్రజలకు చేర్చడంలో కాస్త వెనుకబడి ఉంది. మన దేశంలో పండించిన ఆహారంలో చాలావరకు వృధాగా పోతుంది, సరైన నిల్వ సామర్ధ్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణం, ప్రభుత్వం మరియు కార్పోరేట్ సంస్థలు కలసికట్టుగా పనిచేసి వ్యవసాయ ఉత్పత్తులకు నిల్వ సామర్ధ్యం పెంచగలిగితే, ఆహార భద్రతను మరింత మెరుగుపరచవచ్చు.

 

Share your comments

Subscribe Magazine