Agripedia

జొన్న సాగు ప్రాముఖ్యత, అధిక దిగుబడినిచ్చే రకాలు....!

KJ Staff
KJ Staff

దేశంలో పండించే ఆహారధాన్యపు పంటల్లో జొన్న సాగు ప్రముఖ స్థానంలో ఉంది. జొన్నలను ప్రధానంగా వర్షాధార ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే జొన్నలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు జొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జొన్న సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే మొదట మన ప్రాంత నేలలకు, వాతావరణానికి అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి.

మన ప్రాంత వాతావరణానికి అనువైన జొన్న విత్తనాలు రకాలు:
పి.ఎస్.హెచ్.-1 : దీని పంటకాలం 105 నుండి 110 రోజులు ఉంటుంది.దిగుబడి ఎకరాకు 20-22క్వి. ఎత్తుగా పెరిగి అధిక దిగుబడి నిస్తుంది. ముఖ్యంగా ఖరిఫ్ కుఅను వైన జొన్న రకం.

సి.ఎస్.హెచ్.-1: ఈ రకం మొక్క దాదాపుగా 112 నుంచి 200 సెంటి మీటర్లు ఎత్తు పెరిగి అధిక విత్తనాలతో పాటు అధిక పశుగ్రాసాన్ని ఇస్తుంది. ఎకరాకు 16 నుంచి 17 క్వి దిగుబడినిస్తుంది. పంటకాలం కాలము 112 రోజులుగా ఉంటుంది.ఖరిఫ్కు అనువైన విత్తన రకం.

సి.ఎస్.వి.-15 : ఈ రకం జొన్న ఎకరాకు 14 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చి, పంటకాలం 110రోజులు ఉంటుంది.మొక్క ఏపుగా పెరిగి అధిక గింజల తో పాటు నాణ్యమైన చొప్ప ఇస్తుంది. ఈ జొన్న చొప్పలో అధిక పోషక విలువలు ఉండడంతో పశువులు ఇష్టంగా తింటాయి.విత్తన రకం ఖరీఫ్ పంటకు అనువైనది .

యమ్‌.జె-27(8కిన్నెర) : ఈ జొన్న విత్తన రకం తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అనువైనది.
దీని పంటకాలం 115 నుండి 120 రోజులు పడుతుంది. ఇది బెట్టకు తట్టుకొని ఎకరాకు 12-16 క్వి దిగుబడినిస్తుంది.

నంద్యాల తెల్ల జొన్న-2 : ఈ రకం ఎకరాకు సుమారు 12-14 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
దాదాపు 95-100 రోజులకు కోతకు వస్తుంది . .
జొన్న రకం గింజలు తెల్లగా ఉండి, కంకి నుండి
గింజలు సులువుగా రాలుతాయి.

Share your comments

Subscribe Magazine