Agripedia

రైతులకు హైబ్రిడ్ విత్తనాలు.. వీటితో అధిక దిగుబడులు మరియు లాభాలు..

Gokavarapu siva
Gokavarapu siva

నేటి కాలంలో సంప్రదాయ విత్తనాల కంటే హైబ్రిడ్ విత్తనాల సాగు బాగా పెరిగింది. ఈ హైబ్రిడ్ విత్తనాలను వాడటం వలన రైతులకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఈ తరహాలో పలమనేరు హార్టికల్చర్ డివిజన్కు చెందిన అధికారులు కూరగాయలు మరియు పండ్ల రకాలకు సంబంధించి హైబ్రిడ్ విత్తనాలను తయారు చేసారు. ఈ విత్తనాలను సాగుకు చేయడం వలన అక్కడ రైతులకు అధిక లాభాలు వస్తున్నాయి. ఈ రకాలకు అధిక దిగుబడులు వస్తునందున మిగిలిన రైతుకు కూడా ఈ హైబ్రిడ్ సాగుపై మొగ్గు చూపుతున్నారు.

ఇక్కడ హార్టికల్చర్ దివిజన్లో వివిధ రకాల మొక్కలైనా టమాటా, బీరకాయ, కాలిఫ్లవర్‌, క్యాబేజీ, క్యారెట్‌, మ స్క్‌మిలాన్‌, బెండకాయలు, వంటి పంటలకు హైబ్రిడ్ విత్తనాలను అందిస్తున్నారు. రైతులు కూడా సంప్రదాయ పంటలను పండించకుండా అధిక లాభాలు వస్తునందున ఈ హైబ్రిడ్ విత్తనాలను వేస్తున్నారు. ముఖ్యంగా ఈ పంటలను ఎక్కువగా మారేడుపల్లి, నక్కపల్లి, చెన్నుపల్లి, కల్లాడు, కలగటూరు వంటి మండలాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.

ఈ కొత్త రకాల వంగడాలను కుప్పం దగ్గ్గల్లో ఉన్న సెంటర్‌ఫర్‌ ఎక్సెలెన్స్‌ ఫర్‌ విజటబుల్స్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌ ద్వారా తయారు చేసారు. వీటిని అక్కడ సాగు చేసి ఫలితాలను పరిశీలించారు. ఈ విత్తనాలను రైతులకు అందజేసి హైబ్రిడ్ పంట సాగును ప్రోత్సహిస్తున్నారు. దీనిద్వారా రైతులు అధిక లాభాలను గడిస్తున్నారు. అక్కడ ఉన్న ఆసక్తిగల రైతులకు ఈ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్! పంటలకు సోకే చీడపీడలు, రోగాలను గుర్తించేందుకు కొత్తగా యాప్..

గతంలో కొబ్బరికాయలకు మరియు జామకాయలను కోయాలంటే చెట్టు ఎక్కవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ హైబ్రిడ్ రకాలతో ఈ సమస్య లేదు. జామలో హైబ్రిడ్ రకాలైన తైవాన్‌ జామ, వీఎన్‌ఆర్‌ బిహి రకం జామచెట్లు కేవలం ఐదు అడుగులు మాత్రమే ఎదుగుతాయి. దీనితో చెట్టు ఎక్కవలసిన పని లేదు. పైగా వీటి సైజు మరియు బరువు కూడా సాధారణ జామతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయి.

ఇక్కడ పండించిన పంటను రైతులు నేరుగా చైన్నె, విజయవాడ, చైన్నె మార్కెట్లకు విక్రయిస్తారు. దానితో పాటు మహారాష్ట్ర నుంచి కూడా కొందరు వ్యాపారులు ఇక్కడికి వచ్చి నేరుగా ఉత్పత్తులను కొనుక్కుని వెళ్తారు. దీనితో వీరికి విక్రయ సమస్య కూడా లేదు.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్! పంటలకు సోకే చీడపీడలు, రోగాలను గుర్తించేందుకు కొత్తగా యాప్..

Share your comments

Subscribe Magazine