ఉల్లిపాయల్లో తెల్ల కుళ్ళు తెగులు వల్ల రైతులు 20% నుండి 50 % శాతం వరకు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. సరైన నివారణ చర్యలు చేపట్టకపోతే 15 ఏళ్ల వరకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఉల్లి పంటను ఆశించే తెల్ల కుళ్ళు తెగులు ( White Rot )ఒక శిలీంద్రం (fungus) ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఈ తెగులు నేలలోనుంచి మొక్కను ఆశించి పంటను నాశనం చేస్తాయి.
భూమిలో ఉండే ఈ తెగులకు సంబంధించిన శిలీంద్రాలను అరికట్టడం చాలా కష్టం.ఉల్లికి తీవ్ర నష్టం కలిగించే తెగులలో ఈ తెల్ల కుళ్ళు తెగులు చాల ప్రముఖమైనది.
ఎలా వ్యాప్తి చెందుతుంది : ఇది సిలీన్ద్రం అయినందున ,సోకిన నీరు, పనిముట్ల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతాయి.
గుర్తించడం ఎలా :
ఉల్లి మొక్క ఆకుల యొక్క పై అంచులు పసుపు రంగులోకి మారి వాలిపోతే ఈ తెల్ల కుళ్ళు తెగుళ్లు సోకినట్లు నిర్ధారించుకోవాలి.
అలాగే ఉల్లిపాయల మొదల వద్ద నల్లని మచ్చలు ఏర్పడి, దూది లాంటి తెల్లని శిలీంద్రం అక్కడ పెరగడం గమనించవచ్చు.తరువాత క్రమంగా వేర్లతో సహా మొక్క కుళ్ళిపోయి, ఉల్లిగడ్డలు క్షీణిస్తాయి.
జాగ్రత్త వహించాల్సిన విషయం ఏమిటంటే ఈ తెగులు ఉల్లి పంట ఏ దశలో ఉన్నపుడైన సంక్రమించే అవకాశం ఉంది. ఈ తెగులు లక్షణాలు మొక్క పైనుంచి కిందికి పాకి ఉల్లిగడ్డను కుళ్ళింప చేస్తాయి.
ఉల్లిగడ్డ మొక్కలలో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే పీకి పంట నుండి వేరు చేయాలి.వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల భూమిలో ఉండే ఈ తెగులకు సంబంధించిన శిలింద్రాలు దాదాపుగా సూర్యరశ్మి సోకి నాశనం అవుతాయి.తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి.
ఇక తొలిదశలోనే రసాయన మందులను ఉపయోగించి నివారణ చర్యలు చేపట్టాలి.టేబుకొనేజోల్, పెందాయోపైరాడ్, ప్లూడియోక్సోనిల్, ఇప్రొడియోన్ లాంటి వాటిని ఉల్లినారు నాటడం కంటే ముందే నేలలో వేస్తే ఈ తెగులు వచ్చే అవకాశం ఉండదు.ఒకవేళ పంట వేశాక ఈ తెగుల లక్షణాలు కనిపిస్తే ఈ రసాయన మందులనే ఉపయోగించి పిచికారి చేసి వెంటనే నివారించాలి.
ఇది కూడా చదవండి
Share your comments