Agripedia

పంట నిల్వ సమయంలో పురుగుల బెడదను తగ్గించడం ఎలా?

KJ Staff
KJ Staff

రైతులు ఆరుగాలం కష్టబడి పంటలు పండిస్తారు. ఇంత శ్రమతో పండించిన పంటను, మంచి ధరకు విక్రయించాలని ప్రతి రైతు యోచిస్తారు. అయితే మార్కెట్ ధరల్లో ఎల్లప్పుడూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇటువంటి సమయంలో కొంతమంది రైతులు పంట పొలంలో ఉన్న సమయంలోనే తక్కువ ధరకు విక్రయిస్తుండగా, మరికొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజిలలో మరియు గోడౌన్లలో నిల్వచేసుకుంటారు. ఇలా నిల్వ చేసిన పంటను మార్కెట్ ధర పెరిగిన తరువాత విక్రయిస్తారు. అయితే పంటను నిల్వ చేసే సమయంలో, చీడపీడల బెడద ఎక్కువుగా ఉంటుంది. చీడపీడలను నిర్లక్ష్యం చేస్తే పంటలో ఎక్కువ శాతం పాడైపోయే ప్రమాదం ఉంటుంది. పంట నిల్వ సమయంలో చీడపీడలను నివారించడానికి రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెల్సుకుందాం.

నిల్వచేసే సమయంలో పంటను ఆశించే చీడపీడల గురించి ఇప్పడు తెల్సుకుందాం:
ముక్కు పురుగు: 
ఈ పురుగు యొక్క తల ముందుకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తుంది, అందుకనే దీనికి ముక్కుపురుగు అన్న పేరు వచ్చింది. తల్లిపురుగులు ధాన్యం మీద రంద్రం చేసి వాటి ముద్ర గుడ్లను పెడతాయి. గుడ్ల నుండి బయటకి వచ్చిన పురుగు, ధాన్యం లోపలకి పోయి వాటిని తిని నాశనం చేస్తాయి. ఈ పురుగులు గింజలోనే కోశస్థ దశకు చేరుకుంటాయి. ఇలా వరం రోజుల్లో తల్లి పురుగు ఏర్పడి బయటకు వస్తుంది. 
నుసి పురుగు:
దీనినే కొన్ని ప్రాంతాల్లో పెంకు పురుగు అని కూడా పిలుస్తారు. వీటి తల భాగం కిందికి వంగినట్లు కనిపిస్తుంది. ముందుగా తల్లిపురుగు గింజల మీద గుడ్లను పెడతాయి. వీటి నుండి బయటకి వచ్చిన పిల్లపురుగులు, గింజలను తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకొని, 2-3 వారాల్లో పెద్ద పురుగుల్లాగా మారతాయి. వీటి జీవితంకాలం రెండు నెలల వరకు ఉంటుంది. 
పుచ్చపురుగు:
ఈ పురుగులు ఎక్కువుగా అపరాల పంటలను ఆశిస్తాయి. ఈ పురుగు గింజలపై గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి బయటకి వచ్చిన లార్వాలు, గింజల లోపలి పదార్ధాన్ని తింటూ, కోశస్థదశకు చేరుకుంటాయి. వారం రోజుల్లో తల్లిపురుగు గింజల నుండి గుండ్రటి రంద్రాలు చేసుకొని బయటకి వస్తుంది. 
వడ్ల చిలుక:
ఈ పురుగును ఒక్కో ప్రాంతంల్లో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ పురుగు వరి ధాన్యాన్ని ఎక్కువుగా ఆశించి తీవ్రమైన నష్టం కలిస్తుంది. ఈ పురుగు సీతాకోకచిలుక జాతికి చెందిన రెక్కల పురుగు. ఏవి లేత గోధుమ రంగులో ఉంటాయి. తల్లి పురుగులు వడ్ల మీద గుడ్లను పెడతాయి. ఇవి గుడ్ల మీద ఎదుగుతూ, వడ్ల లోపలి భాగాన్ని తింటూ, అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. రెక్కలు వచ్చిన తరువాత తల్లిపురుగులు గుండ్రటి రంద్రాలు చేసుకొని బయటకి వస్తాయి. 

 

అయితే ఈ పురుగులను నివారించడానికి, మలాథియన్ 125 గ్రా./ 5 లీటర్ల నీటిలో కలిపి గోతాలపై బాగా తడిచేలా చల్లాలి. లేదా మలాథియాన్ పొడిగాని, డెల్టామెత్రిన్ పొడి గాని, 500 గ్రా. ఒక టన్ను కాయల్లో కలపాలి. విష వాయువులను నూనె గింజల సంరక్షణకు ఉపయోగించరాదు. అలా కలిపితే పురుగు మందుల అవశేషాలు ఎక్కువ స్థాయిలో గింజల్లో ఉండి హాని కలిగిస్తాయి కావున జాగ్రత్త వహించాలి.

గోదాముల్లో ఎలుకల బెడద ఎక్కువుగా ఉంటుంది. ఈ ఎలుకలు బస్తాలను కొరికి, ధాన్యాన్ని పాడుచేస్తాయి. ఎలుకలు ఎక్కువుగా ఉంటె, అల్యూమినియం పోష్ఫైడ్, ఒక క్వింటాల్ కు రెండు బిళ్ళల చొప్పున ఉంచాలి. అదే విధంగా జింక్ ఫాస్పైడ్ మందు పెట్టడానికి రెండు రోజులు విషం లేని ఆహారం పెట్టి, తరువాత ఈ మందు కలిపిన ఆహరం ఉంచాలి. విష వాయువులతో నింపటానికి ముందుగా నల్లని పాలిథీలిన్ పేపర్ ను బస్తాల మీద పరవడానికి అనువుగా ఉంచుకోవాలి, కిటికీలకు, వెంటి లేటర్లు, గాలి వెలుపలికి పోకుండా చేయాలి. గోదాములలో నిలువ చేసిన ధాన్య రక్షణకు టన్నుకు 3 గ్రా. అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలను 1 – 2 ఉపయోగించుకోవాలి. ఒక క్వింటాలు అపరాలకు గాని ఉపయోగించి గాలి వెలుపలికి పోకుండా 7 రోజుల వరకు జాగ్రత్త పడాలి.

Share your comments

Subscribe Magazine