ఎదగారుకు చెందిన రైతులు కొత్త రకాల వరిని సాగు చేయడంతో మంచి లాభాలు పొందుతున్నారు. ఆ జిల్లాలో రైతులు ఎక్కువగా కేఎన్ఎం 1638, కేఎన్ఎం 733 రకాల వరిని సాగు చేస్తున్నారు. ఈ కేఎన్ఎం 1638, కేఎన్ఎం 733 వంగడాలు అనేవి ఈ జిల్లా యొక్క వాతావరణానికి సరిగ్గా సరిపోయున్నాయి. ఈ వరి రకాలను సాగు చేయడంతో ఆ పంటలకు చీడపురుగులు కూడా ఎక్కువగా ఆశించట్లేదు. ఈ కేఎన్ఎం 1638, కేఎన్ఎం 733 వంగడాల సాగుతో రైతులు అధిక లాభాలను పొందుతున్నారు.
ఈ జిల్లాలో వరి సాగు అనేది ఏప్రిల్ లో మొదలై సెప్టెంబర్ లో పూర్తవుతుంది. ఈ సమయంలో అక్కడ ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులకు ఈ కొత్త రకం వరి అనేది సరిగ్గా సరిపోతుంది. ఈ రకం విత్తనాలను తెలంగాణాకు చెందిన కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు.
ఈ జిల్లాలో రైతులు ఈ రకం వంగడాలు రాక ముందు జిల్లాలో వరి పంట సాగు కొరకు ఎన్ఎస్ఆర్ 34449, ఎంటీయూ 1010 రకాలను వాడేవారు. ఎంటీయూ 1010 రకాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆ రకాన్ని పూర్తిగా వదిలేసి కేఎన్ఎం 1638, కేఎన్ఎం 733 రకాల వరి వంగడాల సాగుపై అన్నదాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కారణంగా ఈ రెండు రకాల విత్తనాలకు ఎడగారులో డిమాండ్ పెరిగింది.
ఇది కూడా చదవండి..
రైతులకి గుడ్ న్యూస్.. ఈ కేంద్ర పథకంతో రూ.15 లక్షలు..!
ఈ జిల్లాలో సాగు చేస్తున్న ఈ కేఎన్ఎం 733 వంగడానికి చీడపురుగులు ఎక్కువగా ఆశించవు. ఈ బియ్యం కూడా చాలా సన్నగా ఉంటాయి. కాబట్టి ఈ రకం బియ్యానికి మార్కెట్ లో మంచి ధరలు పలుకుతున్నాయి. ఈ రకాన్ని రైతులు 'మినిమం గ్యారంటీ' రకంగా పిలుస్తారు. పైగా ఈ రకం వరికి ముదురు నారు నాటినా పిలకలు బాగా వేసే సామర్థ్యం ఉంటుంది.
మరో రకం వచ్చేసి కేఎన్ఎం 1638. ఈ రకం వంగడాలు అధిక వర్షపాతాన్ని కూడా తట్టుకుంటాయి. అలా తట్టుకుని సాధారణ దిగుబడులను అందిస్తుంది. ఉల్లి కోడు, సుడి దోమ, కాండం తొలిచే పురుగులను సమర్థవంతంగా తట్టుకోవడంతోపాటు అగ్గితెగులు, మెడ విరుపు, పాము పొడ, వేరు కుళ్లు తెగుళ్ల లక్షణాలు కన్పించవు.
ఇది కూడా చదవండి..
Share your comments