Agripedia

మెంతి సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు, సస్యరక్షణ చర్యలు...!

KJ Staff
KJ Staff

సకల పోషక విలువలు ఉన్న ఆకుకూరల్లో మెంతి కూరకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్వల్ప కాలంలో అధిక దిగుబడి నిచ్చే మెంతికూరను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.మెంతి ఏక వార్షిక మొక్క దీన్ని మెంతి ఆకుకూరకు, మెంతి గింజల కొరకు సాగు చేస్తుంటారు.మెంతులను అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు.

అధిక దిగుబడినిచ్చే మెంతి విత్తన రకాలు:
లాం సెలక్షన్ -1: ఈ రకం అధిక ప్రాచుర్యం పొంది అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ మెంతి రకం అధిక కొమ్మలతో గుబురుగా వుండి ఆకు కూరకు మరియు గింజకు పనికి వచ్చే రకం దీని పంటకాలం విత్తిన నాటి నుంచి 85 రోజుల్లో పూర్తవుతుంది. ఈ రాగాన్ని వర్షాధార పంట గాను మరియు నీటి వసతి కింద సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 4-6క్వింటాళ్లు దిగుబడి ఇస్తుంది.

జె.యఫ్ 10.02 రకం: మన ప్రాంత వాతావరణానికి చక్కగా సరిపోయింది. అధిక దిగుబడి ఇచ్చే రకం. దీని పంటకాలం 85 నుంచి 90 రోజులు ఉండవచ్చు. మెంతి ఆకు కొరకు మరియు మెంతి గింజల కొరకు సాగు చేయవచ్చు.

మెంతిలో సస్యరక్షణ చర్యలు:

వడలు తెగులు : మెంతి మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాపించి మొక్కలను అధికంగా నష్టపరుస్తుంది. ఈ తెగులు వ్యాప్తి వల్ల మొక్కలు అధికంగా చనిపోతాయి దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి.

పేనుబంక : మొక్కలు లేత దశలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి.దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2.0 మి.లీ.కలిపి పిచికారీ చేయాలి.

రబ్బరు పురుగు: పంట అన్ని దశల్లోనూ ఈ పురుగు ఆశించి మొక్క అకులను, రెమ్మలను తిని నష్టపరుస్తుంది.దీని నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ కీటకనాశిని 2.5 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine