ఈ మధ్యకాలంలో తామర పురుగుల తాకిడి వ్యవసాయ పంటలకి ఎక్కువైంది ముఖ్యంగా మిరప మరియు వరి పంటలలో వీటి ఉదృతి ఎక్కువగా ఉంది.వీటితో పాటు టమాటా, మామిడి, దోసకాయ మరియు ఆకుకూరల్లో వీటి వాళ్ళ రైతులు విపరీతమైన నష్టాలను చవిచూస్తున్నారు.కొన్ని నివారణ చర్యలను చేపట్టి తామర పురుగుల ఉదృతిని అరికట్టవచ్చు.
మిరప పంటను మరియు వరిని ఎక్కువగా ఆశిస్తున్నా ఈ తామర పురుగులు ఎలాంటి పురుగు మందులకు లొంగడం లేదు రైతులు విపరీతంగా పురుగు మందులను పిచికారీ చేయడం వల్ల ఇవి నిరోధక శక్తిని పెంచుకున్నాయి. అయితే తా మర పురుగుల నివారణ చర్యల గురించి తెలుసుకునే ముందు తామర పురుగుల జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. తామర పురుగులు లేత పసుపురంగులో అతి చిన్న పరిమాణంలో ఉంటాయి.ఇవి ఎక్కువగా మొక్కల ఆకులు లేదా కాయల పై గుడ్లను పెడతాయి.ఒక తల్లి తామర పురుగు సుమారుగా 70 నుండి 90 గుడ్ల వరకు పెడుతుంది మరియు వీటి జీవిత కాలం సుమారుగా నాలుగు వారాలు ఉంటుంది. వీటి జీవిత కాలం ముగిసే లోపే విపరీతంగా గుడ్లను పెడుతుంది.
తామర పురుగులు పైరుని ఆశించడానికి గల కారణాలు:
తామర పురుగులు ఎక్కువగా పూతని ఆశించి పంటలకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. పొలం లోని కలిపి మొక్కల వల్ల కూడా వీటి ఉదృతి ఏర్పడుతుంది. వయ్యారి భామ మరియు తుత్తురు బెండ వంటి కలుపు మొక్కలు తామర పురుగులకు ఆశ్రయంగా ఉంటున్నాయి. మోతాదుకు మించి విపరీతంగా పురుగు మందులను పిచికారీ చేయడం కూడా ఒక కారణం.
గుర్తించడం ఎలా:
తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి.- పురుగులు కాయలను గీరటం వలన కాయల మీద చారలు ఏర్పడుతాయి.
- ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె రాలిపోతుంది.
- ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడస బారుతాయి.
నివారణ చర్యలు:
ముందుగా రైతులు భయాందోనలకి గురి కాకూడదు. తామర పురుగులు మనం వాడే అన్ని రకాల పురుగుమందులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి కాబట్టి పురుగు మందుల ద్వారా వీటిని పూర్తిగా నివారించడం కొంత కష్టం. రైతు సోదరులు ఎక్కువ సంఖ్యలో జిగురు పూసిన నీలిరంగు, పసుపురంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటిని ఆకర్షించి దారి మళ్లించవచ్చు. తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా వేప కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. రసాయన పురుగు మందులను అవసర మేరకే వాడుకోవాలి. పొలంలో అక్కడక్కడ పొద్దు తిరుగుడు మొక్కలను నాటడం మంచిది. తామర పురుగుల ప్రారంభ దశలోనే 2 మిలీ ల పిప్రోనిల్ ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరిన్ని చదవండి.
Share your comments