వ్యవసాయం చేయాలంటే రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రైతులు సులభ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ఎన్నో ఆధునిక పనిముట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు పంట పొలానికి మందు పిచికారి చేయాలంటే రైతులు స్వయంగా పిచికారీ చేస్తూ ఆ రసాయనాల ప్రభావానికి తీవ్ర అస్వస్థతకు గురయ్యేవారు. అయితే నూతన పద్ధతులను అవలంబిస్తే ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా రైతులు పురుగుల మందులను డ్రోన్ల సహాయంతో చేయటం వల్ల ప్రమాదాల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మనదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్లోని రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో ముందు వరుసలో ఉంటారు. ఇక్కడి రైతులు విభిన్న పద్ధతులలో వ్యవసాయం చేయగా మరికొందరు నూతన పంటలను ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే బనస్కాంత జిల్లా,దీశాకి చెందిన రైతు కన్వర్జీ ఠాగూర్... కూరగాయల పంటలపై డ్రోన్లతో పురుగు మందులను పిచికారి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
డ్రోన్ల సహాయంతో పురుగు మందులు పిచికారి చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. అదేవిధంగా నీరు తక్కువగా ఉపయోగించడంతో పాటు, కూలీల ఖర్చు లేకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ అ పొలానికి పిచికారి చేయవచ్చనీ తెలిపారు. డ్రోన్లు కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ద్వారా పనిచేస్తాయి. కాబట్టి... అవి పొలం మొత్తానికీ ఒకేరకంగా పురుగు మందును చల్లుతూ ఎంతో వేగంగా పనులను పూర్తి చేస్తాయని రైతు ఠాగూర్ తెలిపారు. ఈ విధంగా డ్రోన్లతో మందులు పిచికారి చేయడం వల్ల ఇతను మరెందరికో ఆదర్శంగా నిలిచారు.
Share your comments