జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జిఎస్ఐటిఐ), హైదరాబాద్ జియో సైంటిస్ట్‌ల కోసం రిమోట్ సెన్సింగ్ మరియు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ పై 12వ అంతర్జాతీయ కోర్సును నిర్వహిస్తోంది, దీనిని 22 నవంబర్ 2022న హైదరాబాద్‌లోని జిఎస్ఐటిఐ కార్యాలయం లో శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-V అధ్యక్షతన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మాథ్యూ జోసెఫ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, శ్రీ యస్పి భూటియా, డైరెక్టర్ (టెక్నికల్ కోఆర్డినేషన్), డాక్టర్ నిషా రాణి, డైరెక్టర్ (కోర్సు కోఆర్డినేటర్), అధ్యాపకులు మరియు వివిధ దేశాల నుండి వచ్చినా ప్రముఖులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే స్పాన్సర్ చేయబడిన ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC) కార్యక్రమం క్రింద ఈ శిక్షణా కోర్సు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే వృత్తిపరమైన నైపుణ్యాన్ని సృష్టించడానికి సాంకేతికతను పంచుకోవడం ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. 15 (పదిహేను) ITEC దేశాలు (అల్జీరియా, బంగ్లాదేశ్, డొమినికన్ రిపబ్లిక్, ఇథియోపియా, గయానా, కెన్యా, మలావి, మారిషస్, మయన్మార్, నేపాల్, నికరాగ్వా, శ్రీలంక, సూడాన్, టాంజానియా మరియు టోగో) నుండి 15 మంది తేదీ నవంబర్ 22వ 2022 నుండి 20 డిసెంబర్ 2022 వరకు కోర్సుకు హాజరు కానున్నారు.
గ్రూప్ 1 ఫలితలు : కోర్టు తీర్పు వైపే TSPSC మొగ్గు .. వారంలో ఫలితాలకు అవకాశం !
స్వాగత ప్రసంగంలో శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-V మాట్లాడుతూ భూవిజ్ఞాన శాస్త్రం, గనుల, పర్యావరణ, పట్టణ ప్రణాళిక మొదలైనవాటిలో ఉపయోగపడే అధునాతన టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతికతను నేర్చుకునేందుకు శిక్షణలో పాల్గొనే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. వివిధ దేశాల నుండి పాల్గొనేవారి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ శిక్షణ సహాయపడుతుంది. జ్ఞానంతో సహా భారతీయ సంస్కృతి మరియు నాగరికత గురించి తెలుసుకునే అవకాశం వారికి లభిస్తుంది. ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొనేవారికి స్వాగత జ్ఞాపిక ను అందించారు.
ఈ కోర్సులో పాల్గొనేవారికి రిమోట్ సెన్సింగ్ మరియు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అందించబడుతుంది, తద్వారా ఈ పద్ధతులను వారి సంబంధిత రంగంలో సమర్థవంతంగా వర్తింపజేయవచ్చు. దీని ద్వారా, భారతదేశం తన సామాజిక ఆర్థిక అభివృద్ధి మరియు సాంకేతిక విజయాల ఫలాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడం జరుగుతుంది.
Share your comments