ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.ఆదిలాబాద్ జిల్లాలో శెనగ రైతుల పంట పండింది. ఈ సీసన్లో జిల్లాలో శెనగ పంటను రైతులు అధికంగా సాగు చేశారు. దీనితో మార్కెట్లోకి భారీగా శెనగ తరలి వస్తుంది. ప్రభుత్వం కూడా ఈ శెనగ పంటకు మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మార్కెట్ ధర కంటే అధికంగా ఉంది. కాబట్టి రైతులు నేరుగా ప్రభుత్వానికి శెనగ పంటను అమ్ముతున్నారు. అధిక మద్దతు ధర ఉండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటా శెనగకు మద్దతు ధర రూ.5,335 అందిస్తుంది.
ప్రభుత్వం అక్రమాలను అడ్డుకునేందుకు వ్యవసాయ శాఖ ముందుగానే శెనగ సాగు చేసేవారి రైతుల వివరాలను నమోదు చేసుకుంది. దీనితో అధికారులు అందరి దగ్గర శెనగను కొనుగోలు చేయకుండా వివరాలను నమోదు చేసిన రైతుల వద్దనే శనగను కొనుగోలు చేయాల్సి ఉంది.దీనితోపాటు శెనగ రైతులకు మద్దతు ధరను ఇచ్చేందుకు మార్క్ ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శనగను కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు జిల్లాలో 2 లక్షల క్వింటాళ్ల శనగను కొన్నట్లు తెలియజేసారు.
శనగ కొనుగోళ్లు సాఫీగా జరగడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీనితో మార్కెట్లో విక్రయాలు సజావుగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం జిల్లాలో ఏకంగా 26 వేల ఎకరాల్లో అధికంగా శనగ సాగైంది. రైతులు గత సంవత్సరం జిల్లాలో మొత్తానికి 1.06 లక్షల ఎకరాల్లో శనగను సాగు చేశారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా ఉండడంతో పంటకు అధిక దిగుబడులు వచ్చాయి అని రైతులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
పశువులకు ఆదివారం సెలవు ..100 ఏళ్ల సంప్రదాయం.. ఎక్కడంటే?
రైతులు మద్దతు ధర బాగుంది అనుకుంటే, అనధికారులు రైతుల పైనే హమాలీ ఛార్జీలు వేస్తున్నారు. మొదట్లో 50 కిలోల సంచి నింపేందుకు రూ.5, మరియు సంచి కుట్టేందుకు, తూకానికి రూ.10 తీసుకునేవారు. ప్రస్తుతం అధికారులు ఒక్కో సంచిపైన రూ. 32 వసూలు చేస్తున్నారు. దీనితోపాటు రైతుల నుండి అదనంగా ఆరు కిలోల శెనగను తీసుకుంటున్నారు. పైగా కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు ఇంకా ఇవ్వలేదు. సుమారుగా రూ.100 కోట్లకు పైగానే జిల్లాలో రైతులకు సొమ్ము చెల్లించవలసి ఉంది.
రైతులు శనగ పంట సాగు చేసినట్లు ఆన్లైన్లో పొందుపర్చిన సర్వేలో పేరుంటేనే రైతు నుంచి కొంటున్నారు. అధికారులు ఒక్కో రైతు నుంచి ఎకరాకు 6.30 క్వింటాళ్లు శెనగను కొనుగోలు చేయాలని పరిమితి పెట్టారు. మార్కెట్లో క్వింటాలు ధర రూ.4,700 ఉండగా, ప్రభుత్వ మద్దతు ధర రూ.5,335 ఉంది. గతంలో వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా నేరుగా ప్రభుత్వ కేంద్రాలకు రైతులు విక్రయిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments