ఇప్పటివరకు మీరు ఎర్ర మిర్చి మాత్రమే చూసివుంటారు , ఎప్పుడైనా గోల్డ్ కలర్ మిర్చి గురించి విన్నారా ? గతం లో కర్నూల్ జిల్లా రైతు గుంటూరు మార్కెట్ యార్డుకు గోల్డెన్ కలర్ కల్గిన మిర్చిని తీసుకొచ్చాడు అతను తెచ్చిన పసుపు రంగు మిర్చి అప్పట్లో అందరిని ఆశ్చర్య పరిచింది . మార్కెట్టుకు తీసుకొచ్చినా కొద్దీ సేపటికే క్వింటాల్‌కు రూ.14000 తో అమ్ముడు పోయింది .
ఇదే రకం మిర్చి వెరైటీ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం నాదరి ఎల్లో(గోల్డ్ కలర్) మిర్చి వచ్చింది ఇది తెలంగాణ మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి , జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన బుస్సా కుమారస్వామి 14 బస్తాల గోల్డ్ కలర్ మిర్చిని తీసుకొచ్చారు .
ఉదయకృష్ణ కమర్షియల్ కార్పొరేషన్ అడ్తి ద్వారా ఓ వ్యాపారి క్వింటాల్‌కు రూ.40వేలతో కొనుగోలు చేస్తానని చెప్పాడు. కాగా, నమస్తే తెలంగాణకు లభించిన సమాచారం మేరకు రైతు మిర్చిని క్వింటాల్‌కు రూ.50వేలకంటే తక్కువ ఇవ్వనని చెప్పడంతో వ్యాపారి వెనుతిరిగి పోయాడు. కాగా ప్రత్యేకమైన మిర్చి రకం కావడంతో మార్కెట్ అధికారులు మిర్చి బస్తాలను కోల్డు స్టోరేజీలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌కు కొత్త రకం మిర్చి వచ్చినట్లు ప్రచారం కావడంతో పెద్ద మొత్తం లో వ్యాపారాలు మరియు రైతులు మిర్చిని చూసేందుకు ఎగబడ్డారు .
మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...
ఇదేక్రమంలో గతవారం ఈ ఏడాది ఏకంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్కు కేవలం నాలుగు క్వింటాళ్ల దేశీ రకం మిరపకాయలు(పొడి)-దేశి వరంగల్ రకం 4 క్వింటాలు రాగ క్వింటాల్ కు గరిష్టముగా 80,100 చొప్పున రికార్డు ధర పలికింది .
Share your comments