ప్రస్తుత కాలంలో రైతుల పరిస్థితులు రోజురోజుకు ఎంతో దీనావస్థలోకి చేరుతున్నాయి. పంట సాగు చేయాలంటే అధిక పెట్టుబడులు అవసరం అవుతూ ఉండడమే కాకుండా రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.ఈ క్రమంలోనే కొందరు వ్యవసాయానికి స్వస్తి చెప్పగా మరికొందరు వ్యవసాయంపై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక అప్పు చేసి మరి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పొలంలో వ్యవసాయం చేయాలంటే తప్పనిసరిగా ఎడ్లు ఉండాలి. అయితే రైతులు లక్షలు పోసి ఎడ్లుకొనే పరిస్థితులలో రైతులు లేరు.ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు చేద్దామా అంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేయడంతో ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు.
ఈ క్రమంలోనే కొందరు రైతులు ప్రస్తుతం ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని సేంద్రియ వ్యవసాయానికి బదులుగా ఆధునిక వ్యవసాయం చేయడానికి అలవాటు పడ్డారు. ఇలాంటి క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా రైతు ఒక సరికొత్త ఆలోచన చేసి అందరినీ అబ్బురపరిచాడు.ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండల కేంద్రానికి చెందిన మేకల మల్లేశ్ అనే రైతు ఇట్లు లేకుండా గంటలో తన పొలంలో ఉన్నటువంటి పత్తి సాగులో 60 గుంటలను కేవలం గంట వ్యవధిలోనే దున్ని అందరిని ఆశ్చర్యపరిచాడు.
మల్లేష్ తన దగ్గర ఉన్న ద్విచక్ర వాహనానికి వ్యవసాయ పనిముట్లను అమర్చుకొని తన పొలం మొత్తం గంట వ్యవధిలోనే దున్నాడు.ఈ క్రమంలోనే తన పొలం మొత్తం వ్యవసాయం చేయడానికి రైతు మల్లేష్ కు కేవలం వంద రూపాయలు పెట్రోల్ మాత్రమే ఖర్చు అయింది. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో పొలం మొత్తం వ్యవసాయం చేసుకోవడంతో రైతు ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ద్విచక్ర వాహనం సహాయంతో రైతు మల్లేష్ చేసిన వ్యవసాయానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇది చూసిన పలువురు గ్రామస్తులు వారు కూడా ఇదే పద్ధతిని అనుసరించి వ్యవసాయ పనులు చేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం.
Share your comments