సాధారణంగా చేపలలో ఎన్నో పోషకాలు ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చేపలను తరచూ మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక పోషక విలువలు మనకు అంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే చాలా మందికి ఏ విధమైనటువంటి చేపలు మంచివి. తాజాగా ఉండే చేపలు ఏవని కనుగొనడం ఎంతో కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే చేపలను కొనుగోలు చేసేటప్పుడు పెద్దఎత్తున మోసపోతుంటారు. మరి మార్కెట్లో లభించే చేపలు తాజా చేపలను సింపుల్ చిట్కాలను ఉపయోగించి గుర్తించండి.
చేపలు తాజాగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం చేపల వాసన చూసి గుర్తించవచ్చు. సాధారణంగా చేపలను వాసన చూసినప్పుడు చేపలు చెడువాసన కాకుండా, సముద్రపు నీటి వాసన వస్తే ఆ చేపలు ఎంతో తాజా చేపలని చెప్పవచ్చు. అలా కాకుండా కొద్దిగా చెడువాసన వస్తే ఆ చేపలు పాడైపోయాయని అర్థం. అలాగే చేప కళ్లపై తెల్లటి పొరలా ఏర్పడినా లేదంటే కళ్ళు లోతుగా వెళ్ళినా ఆ చేపలు తాజా చేపలు కాదని అర్థం. తాజా చేపలకు కళ్ళు ఎల్లప్పుడూ ఉబ్బి, ప్రకాశవంతంగా ఉంటాయి.
చేపలను కొనుగోలు చేసేటప్పుడు వాటి రంగు ఆకృతిని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. తాజా చేప అయితే చేపను పట్టుకోగానే గట్టిగా ఉంటుంది. అదేవిధంగా చెడిపోయిన చేప అయితే మెత్తగా ఉంటుంది. అదేవిధంగా చేపలను మొప్పల ద్వారా కూడా అవి తాజా చేపలా, పాడైపోయిన చేపలా అని గుర్తించవచ్చు. తాజా చేపలకు మొప్పలు కింద చూడగానే కింది భాగంలో తేమతో కూడిన గులాబీ రంగులో ఉంటే అవి తాజా చేపల నిర్ధారించుకుని కొనవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
Share your comments