పాలీఫీడ్ మరియు మల్టీ 'కె' వంటి నీటిలో కరిగే ఎరువులు ముఖ్యంగా వరి సాగులో ఉపయోగించబడుతున్నాయి. అయితే మిగితా ఎరువులతో పోలిస్తే వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
పాలీఫీడ్ ఎరువులు ఐరన్, మాంగనీస్, బోరాన్, జింక్, కాపర్ మరియు మాలిబ్డినం వంటి 6 సూక్ష్మ-పోషకాలతో 19: 19: 19 NPKని కలిగి ఉంటుంది, అయితే మల్టి Kలో 13: 0: 46 NPK ఉంటుంది.
ఈ ఎరువులు నీటిలో పూర్తిగా కరుగుతాయి కాబట్టి ఈ ఎరువులను పూర్తిగా ఆకుల ద్వారా మొక్కకు పోషకాలను సమృద్ధిగా అందిచవచ్చు.
ఈ ఎరువులు సోడియం మరియు క్లోరైడ్ వంటి ఇతర హానికర మూలకాలను కలిగి ఉండవు.ఈ పోషకాలు ఆకుల ద్వారా సులభంగా గ్రహించబడతాయి.
వీటి వినియోగం వలన, దీర్ఘకాలిక కరువు వంటి కొన్ని సందర్భాల్లో, తేమ కోసం మట్టికి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు.
పంట పుష్పించే మరియు ధాన్యం పండే క్లిష్టమైన దశలలో పోషకాలను సరఫరా చేయడంలో స్పెషాలిటీ ఎరువుల యొక్క ఆకుల అప్లికేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వరిలో పుష్పించే మరియు ధాన్యం ఏర్పడే క్లిష్టమైన దశలలో పోషకాలను సరఫరా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
కరువు మరియు నీటి ఎద్దడి ఉన్న ప్రత్యేక పరిస్థితులలో నత్రజనిని ఫోలియర్ స్ప్రేగా వాడడం ఉత్తమం.
పవర్ స్ప్రేయర్‌ని ఉపయోగించి 15% లేదా అధిక వాల్యూమ్ స్ప్రేయర్‌ని ఉపయోగించి 5% గాఢతతో తక్కువ వాల్యూమ్ స్ప్రేగా యూరియాను ఉపయోగించవచ్చు
జింక్ లోపం లక్షణం కనిపించినట్లయితే, దీనిని అధిగమించడానికి 0.5% జింక్ సల్ఫేట్ + 1.0% యూరియాను 15 రోజుల వ్యవధిలో ఆకుల మీద పిచికారీ చేసుకోవాలి.
నిరంతర వర్షాల కారణంగా వరదలున్న పరిస్థితుల్లో మట్టికి ఎరువులు వేయలేనటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఈ నీటిలో కరిగే ఎరువులు పంటను పోషకాల లోపం నుండి కాపాడుతాయి. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది.
మరిన్ని చదవండి.
Share your comments