Agripedia

ఐదు అంచెల పద్దతిలో సాగు విధానం!

S Vinay
S Vinay

ఈ ఐదు అంచెల సాగు విధానాన్ని భారతీయ వ్యవసాయవేత్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రవేశ పెట్టా

ఈ వ్య్వవసాయ విధాన ప్రథమ ఉద్దేశ్యం మనకు ఉన్న ప్రతి అంగుళం భూమిని ఫలవంతంగా ఉపయోగించుకోవడం మరియు అధిక ఆధ్యాన్ని గడించడం.రైతు తన పొలం మొత్తం విస్తీర్ణంలో ఒక ప్రధాన పంటను సాగు చేయడం లేదా ఒక ప్రధాన పంటతో పాటు అంతర పంటగా ఉద్యానవన పంటలను సాగు చేయడం వంటి సంప్రదాయ పద్ధతిలో కాకుండా, ఈ విధానంలో మనకు ఉన్న చిన్న పాటి భూమిలో ఐదు రకాల పంటలను సాగును చేయవచ్చు.

ఈ సాగు విధానం ప్రకారం ప్రకారం ఎకరం వ్యవసాయ భూమిలో 100 చదరపు మీటర్లను బేస్ యూనిట్‌గా తీసుకుని ఐదు రకాల పంటలను నిర్దిష్ట నమూనాలో పెంచి అందులో 2.5 అడుగుల పొడవుతో మూడు గోతులు తవ్వుతారు.మొదటి పొరగా, బయటి పొరలో మరియు బేస్ యూనిట్ యొక్క నాలుగు మూలల్లో పెంచిన పంటగా, ఒక రైతు అందుబాటులో ఉన్న స్థలానికి సరిపోయేలా నిర్దిష్ట సంఖ్యలో కొబ్బరి, మామిడి, సపోట మరియు ఇతర పంటలను పెంచవచ్చు. రెండవ పొరలో, సిట్రస్ మరియు ఇతర మొక్కలను పెంచవచ్చు. మూడవ పొరలో అరటి, బొప్పాయి మరియు ఇతర పండ్ల 20 మొక్కలు మరియు నాల్గవ పొరలో ఆపిల్‌తో సహా ఎనిమిది మొక్కలు ఉంటాయి.పప్పుధాన్యాలు మరియు కూరగాయలను పెంచడానికి రైతు ఐదవ పొరను ఉపయోగించవచ్చు మరియు వీలైతే, నేల అనుకూలత ఆధారంగా పప్పుధాన్యాలకు బదులుగా వరి కూడా వేయవచ్చు.


బేస్ యూనిట్‌లో వాటి పొడవు, వెడల్పు మరియు లోతుకు సంబంధించి నిర్దిష్ట కొలతలకు గోతులు తవ్వినప్పుడు, రైతు ఎండిన మొక్కల ఆకులను, ఆవు పేడ,సేంద్రియ ఎరువులు మరియు జీవామృతం కలిపి గోతులలో వేసుకోవాలి.మొక్కలు వాటి పోషణ మరియు పెరుగుదల కోసం వీటి నుండి పొందుతాయి. ఈ గోతుల నుండి మొక్కలకు అవసరమైన తేమను సరఫరా చేస్తాయి. కాబట్టి ఈ సాగు విధానంలో మొక్కలకు నీటి సరఫరా అంతగా అవసరం లేదు.

ఈ ఐదంచెల సాగు విధానంలో భూమి మొత్తం మొక్కలతో కప్పబడి ఒక చిన్నపాటి అడవిలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

మరిన్ని చదవండి.

మానవ మనుగడకి పంచ భూతాలు ఎంత అవసరమో తేనెటీగలు కూడా అంతే అవసరం!

Share your comments

Subscribe Magazine