ప్రస్తుతం రైతులు సంప్రదాయ పంటలైన వరి, పత్తి, మరియు మొక్కజొన్న పంటలను పండించడమే కాకుండా కొత్త రకం పంటలను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రైతులు పామారోజా సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇది గడ్డి వాతావరణ పరిస్థితులను జాతి మొక్క అయినప్పటికీ, రైతుకు భారీ లాభాలు తెచ్చిపెడుతోన్న పంట.
ఈ పంట నుండి నూనెను తయారుచేస్తారు. ఈ నూనెకు జాతీయంగా మరియు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పంట భారీ వర్షపాతం మరియు తీవ్రమైన సూర్యకాంతితో సహా విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. పొలంలో నీరు అనేది నెలల పాటు నిలిచిపోయిన పంట ఏమి పాడవదు.
ఈ మొక్క ఒక్కసారి నాటితే దాదాపు ఐదేళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ పామారోజా నుంచి తీసిన నూనె ప్రస్తుతం రూ.1,500-2,000 వరకు పలుకుతోంది. ఏడాదికి దాదాపు ఐదుకు పైనే కోతలు కోయవచ్చు. ఎకరాకు 50-60 కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది. ఎకరా భూమికి 12-15 కిలోల విత్తనాలు అవసరం. ఈ విత్తనాలు కిలో ధర రూ.2వేలు వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి..
వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యాపారాన్ని చేస్తూ మంచి లాభాలు పొందుతున్న రైతు.. పూర్తి వివరాలకు చదవండి..
లేదా ఇప్పుడు సాగు చేస్తున్న రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేస్తే రూ. వెయ్యికి పొందవచ్చు. విత్తనాలు విత్తిన 3 నెలల తర్వాత మొదటి పంట చేతికి అందుతాది. విత్తుకున్న మొదటి ఏడాది 5 పంటలు వస్తే ఆ తర్వాత నుంచి 6 పంటలు తీయవచ్చు. ప్రతీ 2 నెలలకు ఒక పంట తీయవచ్చు. సాగుకు ఎకరాకు కేవలం రూ.15-25 వేల పెట్టుబడి మాత్రమే అవుతుంది. ఈ మొక్కకు ఎలాంటి చీడలు ఆశించవు.
ఈ పంట ఎటువంటి తెగుళ్ళ బారిన ఎక్కువగా పడదు. పురుగుమందులు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి నీరు మరియు ఎరువులు వేయడం ద్వారా పంటకు తగినంత పోషణ లభిస్తుంది. మెట్ట ప్రాంతంలో రైతులు ఈ పంటను సాగు చేసి ఏటా ఎకరాకు రూ.80 వేల నుంచి లక్ష వరకు గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది. రైతు చేను వద్దే బాయిలర్ ఏర్పాటు చేసుకుంటే సొంతంగా నూనె తీసి మార్కెటింగ్ చేసుకునే వీలుంటుంది.
ఇది కూడా చదవండి..
Share your comments