Agripedia

నల్లమిరియాల్లో కొన్ని ప్రత్యేక రకాలా గురించి తెలుసుకుందాం....

KJ Staff
KJ Staff

భారతీయుల వంటకాల్లో మరియు మాసాలలో మిరియాలకు విశిష్టమైన స్థానం ఉంది. వీటిలో నల్ల మిరియాలు వాటి ఘాటుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి అందుకే వీటిని సుగంధద్రవ్యాల్లో రాజుగా పరిగణిస్తారు. ఈ నల్ల మిరియాలను కేరళ, తమిళనాడు, మరియు కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా సాగుచేస్తారు. ప్రపంచం మొత్తం మీద నల్ల మిరియాల సాగు అధికంగా జరిగేది భరత దేశంలోనే, వీటిని అధికంగా వినియోగించేది కూడా భారతీయులే.

Varieties of Black Pepper
Varieties of Black Pepper

పూర్వం నల్ల మిరియాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పెరిగేవి, ప్రజలు వీటిని అడవి నుండి సేకరించి విక్రయించేవారు, కాలానుగుణంగా వీటికి డిమాండ్ పెరగడం ద్వారా రైతులు వీటిని సాగుచెయ్యడం ప్రారంభించారు. ఎన్నో వ్యవసాయ పరిశోధన సంస్థలు వాణిజ్య అవసరాలకు అనుగుణంగా చాల రకాల నల్లమిరియాలను అభివృద్ధి చేసి వీటిని విడుదల చేసారు.వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకర:

ఈ రకం 1990 లో విడుదలయ్యి ఇప్పటికి ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే శ్రీకర రకం వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలదు, అంతేకాకుండా కొమ్మ కత్తిరింపులు నుండి కూడా వీటిని పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకాన్ని కేరళ మరియు దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా సాగుచేస్తారు. మొక్కలు చీడపీడల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ శ్రీకర రకం సుమారు 4200 కేజీల దిగుబడిని ఇవ్వగలిగిన సామర్ధ్యం కలిగిఉంది.

శుభకర:

ఒకప్పుడు కర్ణాటక మరియు కేరళలో ప్రాచుర్యంలో ఉన్న కరిముండా(KS 27) అనే రకం నుండి ఈ శుభకర రకాన్ని అభివృద్ధి చెయ్యడం జరిగింది. శ్రీకర రకం లాగే ఈ రకాన్ని కూడా కేరళ మరియు కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చెయ్యవచు, వివిధ వాతావర్ణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలదు కాబట్టి అనేక ప్రాంతాల్లో సాగుచెయ్యడానికి ఆస్కారం ఉంటుంది. ఒక హెక్టారు నుండి సుమారు 2353 కేజీల దిగుబడిని పొందవచ్చు.

పౌర్ణమి:

పౌర్ణమి రకం మొక్కలను, 1991 లో విడుదల చేసారు, కో-812 అనే రకం మొక్కల నుండి ఈ రకాన్ని అభివృద్ధి చేసారు.ప్రస్తుతం పౌర్ణమి రకం నల్లమిరియాలను కేరళ మరియు కర్నటక ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. మిగిలిన రకాలతో పోలిస్తే ఈ రకానికి అధిక దిగుబడిని ఇవ్వగలిగే సామర్ధ్యం ఉంది. ఒక హెక్టర్ నుండి దాదాపు 5356 కేజీల దుగుబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పౌర్ణమి రకం రోగాలను కూడా సమర్ధవంతంగా తట్టుకోగలదు.

ఐఐఎస్ఆర్-తేవమ్
2004 లో విడుదలైన ఈ రకం, తేవన్ముడి అనే రకం నుండి క్లోనల్ సెలక్షన్ పద్ధతి ద్వారా అభివృద్ధి చెయ్యబడింది. ఈ రకం ఎతైన ప్రదేశాలల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలదు, అంతేకాకుండా కాండం కుళ్ళు తెగులును సమగ్రవంతంగా తట్టుకోగలదు. ప్రతిమొక్కనుండి ఐదున్నర కేజిల ముడి మిరియాలను ఉత్పత్తిచేయ్యగల సామర్ధ్యం కలిగిఉంది.

ఐఐఎస్ఆర్-శక్తీ:

ఈ రకం 2004 లో విడుదలయ్యింది, మెట్ట ప్రాంతాలు మరియు ఎత్తైన కొండ ప్రాంతాలకు అనుగుణంగా ఈ రకాన్ని అభివృద్ధి చేసారు, దీనిని వర్షాధారిత పంటగా కూడా సాగుచెయ్యవచ్చు. నల్లమిరియాల మొక్కలను ఆశించే కాండం కుళ్ళు తెగులును సమగ్రవంతంగా తట్టుకొని నిలబడగలదు.

ఆర్కాక్రోగ్ ఎక్సెల్:

ఇటీవల కాలంలో విడుదలైన ఈ వెరైటీ ఎంతో ప్రాచుర్యం సంతరించుకుంది. నల్ల మిరియాలు సాగు చేసే అన్ని ప్రాంతాలల్లో ఈ రకాన్ని సాగు చెయ్యడానికి వీలుగా ఉంటుంది. దిగుబడి కూడా ఆశించిన విధంగా ఉండటంతో రైతులు ఈ రకాన్ని సాగుచెయ్యడానికి మొగ్గు చూపుతున్నారు.

Share your comments

Subscribe Magazine