Agripedia

అరటి తోటల్లో అంతర పంటలతో.. అదనపు ఆదాయం పొందుతున్న రైతులు..!

KJ Staff
KJ Staff

ఏడాది పొడవునా రాష్ట్రంలో అరటి సాగుకు అనుకూలంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తూ దాదాపు 63 లక్షల టన్నుల అరటి ఉత్పత్తిని సాధిస్తూ దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో కొనసాగుతోంది. అరటి వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించు కోవడంతో చాలా మంది రైతులు అరటి పంటను సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.వాతావరణ పరిస్ధితుల ప్రభావం కారణంగా ఒక్కో ఏడాది అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి పంటలో అంతర పంటలుగా స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతర పంటలసాగు ద్వారా రైతు అధిక అదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. అనుకోని పరిస్ధితుల్లో వేసిన పంటల్లో ఒక దాంట్లో నష్టం వచ్చినా మరో దాని ద్వారా ఆనష్టాన్ని పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

వేసవి కాలంలో నీటి సదుపాయం ఉన్న పొలాల్లో అరటిలో అంతరపంటగా పుచ్చ, దోస వంటి తీగజాతి పంటను వేసుకుంటే అదనపు అదాయాన్ని రైతులు సమకూర్చుకోవచ్చు. అరటి ఏడాది పంట కావటంతో అరటి మధ్యలో శనగ, బొప్పాయి, నేల చిక్కడు, టమాటో, వంగ, వంటి కూరగాయ జాతి మొక్కలను సాగు చేసుకోవచ్చు.వీటితోపాటు కంద, క్యారెట్, బీట్ రూట్, క్యాలీఫ్లవర్, క్యాబేజి వంటి స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలను అరటి తోటలో అంతర పంటలు సాగుచేస్తూ మెరుగైన దిగుబడులు పొందవచ్చు

ప్రస్తుత వాతావరణం వ్యవసాయానికి అనుకూలించకపోవడంతో చాలా మంది రైతులు ప్రధాన పంటలు స్వల్పకాలంలో చేతికొచ్చే అంతర పంటలను సాగుచేస్తూ సంవత్సరం పొడవునా నిలకడైన ఆదాయాన్ని పొందుతున్నారు. అంతర పంటలుగా సాగు చేయడం వల్ల ఏడాది పొడవునా ఆదాయం పొందవచ్చు. అలాగే ప్రధాన పంట అయినా అరటికి పెట్టుబడి ఖర్చులు సమకూర్చుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine