తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్లో విరివిగా సాగయ్యే పంట వరి. ప్రస్తుతం వరి వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల నాట్లు వెయ్యడం పూర్తవగా మరికొన్ని చోట్ల ఇప్పుడే నాట్లు వెయ్యడం ప్రారంభించారు. అయితే వరి పంటలో కలుపు ప్రధాన సమస్య. వరిలో వచ్చే కలుపుని సకాలంలో నియంత్రించకుంటే, దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. ఒకవైపు కూలీలా సమస్య మరోవైపు వానలతో కలుపు యాజమాన్యం భారంగా మారింది.
వరి నాట్లు నాటిన, 3 నుండి 4 రోజుల్లోనే, కలుపు మందు పిచికారీ చేస్తే, కలుపు సమస్యను తగ్గించి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీనితోపాటు కలుపు నివారణ కోసం సమగ్రయజమాన్య పద్దతులు పాటిస్తే మంచి నాణ్యమైన దిగుబడి పొందేందుకు వీలుంటుంది. వివిధ దశల్లో చేప్పట్టవలసి యాజమాన్య పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వరిలో కలుపు ఎక్కువుగా ఉంటే, మొక్కకు అందవలసిన పోషకాలు అన్ని కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. వరి నాట్లు నాటిన 3-5 రోజుల వ్యవధిలో, కలుపు రాకుండా నివారించగలిగే మందులను పిచికారీ చేసుకోవాలి. ఇందుకోసం బ్యూటక్లోర్ ఒక లీటర్ మందును, 20 కిలోల ఇసుకలో కలిపి, పొలాల్లో చల్లాలి. మందు చాల్లే మందు చల్లిన తర్వాత నీరు పెట్టకుండా ఉంటే మందు ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనితోపాటుగా ఆక్సీడైజోల్ 2 గ్రాముల చొప్పున ఒకలీటర్ నీటికి కలుపుకొని మొక్కలపై పిచికారీ చెయ్యాలి.
వరి పంటలో తుంగ మరియు గరిక సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాండాక్స్ పవర్ అనే మందును 2.5 మిల్లీగ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే కలుపును రాకుండా నివారించుకోవచ్చు. అదే విధంగా తరచు పొలంలో వచ్చే కలుపును చేతితో నివారిస్తూ ఉండాలి. ఈ విధంగా వరిలో కలుపు యాజమాన్య పద్దతులు సమయానుసరంగా పాటిస్తే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.
Share your comments