ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా వారి వ్యవసాయ పద్ధతులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని రైతులు అతి తక్కువ పెట్టుబడి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంటలను పండిస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం మార్కెట్లో నిమ్మగడ్డికి ఎంతో డిమాండ్ ఉందని తెలుస్తోంది. నిమ్మగడ్డకి మార్కెట్లో డిమాండ్ ఎందుకు ఉంది? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
నిమ్మగడ్డి వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఎలాంటి కష్టంతో కూడుకున్న పని ఉండదు. చాలా సులువైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ పంటలు పండించవచ్చు. ఎలాంటి రసాయన మందులు లేకుండా కేవలం ఐదు నెలలో పంట చేతికి వస్తుంది. ఈ పంటలు పండించడానికి కీటకాల బెడద ఉండదు,అదేవిధంగా నీటి అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని ఇచ్చే పంట అని చెప్పవచ్చు.
రైతులు పండించిన ఈ నిమ్మగడ్డకి మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈ గడ్డి నుంచి తీసిన నూనె మార్కెట్లో వివిధ రకాల కాస్మెటిక్, డిటర్జెంట్లు, మందుల లో ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ నిమ్మగడ్డకి అధిక డిమాండ్ ఏర్పడింది. మార్కెట్ లో ఈ నిమ్మగడ్డి నూనె ఒక లీటరు సుమారు 1,000 నుంచి 1500 వరకు ధర పలుకుతోంది. ఈ ప్రకారం ఒక ఎకరానికి సుమారు గా 50 నుంచి 65 లీటర్ల నూనెను తీయవచ్చు. ఈ విధంగా చూస్తే రైతుకు ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చని చెప్పవచ్చు.
ఈ నిమ్మగడ్డి వల్ల కేవలం నూనె మాత్రమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. నిమ్మ గడ్డితో తయారు చేసుకున్న టీ లను తాగడం వల్ల ఏ విధమైనటువంటి శ్వాసకోస సమస్యలు, దగ్గు, జ్వరం, కఫం వంటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి కల్పించి మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. శరీర బరువు తగ్గాలనుకొనే వారికి కూడా ఈ నిమ్మగడ్డి టీ ఎంతో దోహదపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు దాగి ఉండటం వల్లే ఈ నిమ్మగడ్డి పంటకు మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు.
Share your comments