ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అధికమొత్తంలో శరీర బరువు పెరిగే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. మన శరీరంలో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోవటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో హాట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో కొవ్వు కరగడానికి చాలామంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కేవలం ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి శరీరంలో కొవ్వు తగ్గించుకోండి.
మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం కోసం ఖర్జూరాలు ఎంతగానో దోహదపడతాయి. ఖర్జూరాలతో తయారుచేసుకున్న రసం తాగడం వల్ల మన శరీరం,తొడల భాగాలలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ఎంతో సులభతరమవుతుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కూడా ఎంతో సులభం కనుక తొందరగా మన శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చు.
ముందుగా ఖర్జూరాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.అదేవిధంగా చిన్న అల్లం ముక్కను శుభ్రం చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక గ్లాసు నీటిని వేసి బాగా మరిగించుకోవాలి. నీరు బాగా మరిగిన తరువాత వాటిని వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి సరైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఖర్జూరాలలో ఐరన్ ఎక్కువగా ఉండటం చేత మన శరీరానికి తగినంత రక్తాన్ని అందించడంలో కూడా దోహదపడుతుంది.
Share your comments