టమాటాలు మనము రోజు వండుకునే అన్ని వంటల్లో దాదాపుగా వాడుతాం ఎల్లప్పుడూ ఇది మన వంట గదిలో ఉంటుంది మరి వాటిని బయట మార్కెట్లో విక్రయించడం ఎందుకు మన ఇంటి ఆవరణంలోనే పండించవచ్చు. అవి పండించడం కూడా చాలా సులభం. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
టమాటాలు పెరగడానికి పెద్ద తోట అవసరం లేదు ముందుగా చేయాల్సిందల్లా ఇష్టమైన రకాన్ని ఎంచుకోవటం ఇంకా కింద వివరించిన సూచనలను అనుసరించండి.
టమాటాలను సాధారణంగా వేసవిలో మార్చి నుండి జూన్ మధ్య పండిస్తారు. మట్టిలో 3 నుండి 4 అంగుళాల లోతులో చిన్న కుండలలో టమోటా విత్తనాలను నాటండి. టమాటాలు బరువైన బంకమట్టి నేల మినహా ఏ రకమైన నేలలోనైనా పెరుగుతాయి. నేల యొక్క ఉదజని సూచిక (pH స్థాయి) 6 నుండి 6.8 వరకు ఉండాలి.
టమోటా విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైన ఉష్ణోగ్రత 21 నుండి 27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. మంచి దిగుబడిని పొందడానికి, మొక్కలను వెచ్చని ప్రదేశంలో ఉండేట్లు చూసుకోవాలి . మొలకలు సాధారణంగా 10 నుండి 14 రోజులలో వస్తాయి .టమాటా విత్తనాలు మొలకెత్తే వరకు ఎక్కువ నీరు అవసరం లేదు కానీ నేలలో తేమ శాతం ఉండేట్లు చూసుకోవాలి.
తరువాత ఆరోగ్యకరంగా వున్నా టమాటా నారుని ఎంచుకొని నాటుకోవాలి నాటిన తరువాత మొక్కలకి నీటిని అందివ్వాలి.
నాటిన 60 నుండి 75 రోజులలో టమాటా పండ్లు కాయడం ప్రారంభిస్తాయి.
మరిన్ని చదవండి
Share your comments