Agripedia

కనకాంబరాల సాగుతో రైతులకు మంచి ఆదాయం?

KJ Staff
KJ Staff

పూల సాగుతో రైతులకు మంచి లాభాలు, ఆదాయం వస్తుంది. ఎందుకంటే వీటికి మార్కెట్ లో సీజన్ తో సంబంధం లేకుండా డిమాండ్ ఉంటుంది. అందుకే తక్కువ భూమి ఉన్న రైతులు సైతం పూల సాగు లాభాదాయకంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సాంప్రదాయకంగా రైతులు సాగు చేస్తున్న పూలల్లో కనకాంబరాలు ఒకటి. ఇవి సంవత్సరం పోడవునా పూలను అందిస్తాయి. చూడ్డానికి చిన్నగా ఉండే వీటిని మామిడి, కొబ్బరి వంటి తోటల్లోనూ అంతర పంటగా సాగు చేయవచ్చు. అలాంటి కనకాంబరాలు ఎలా సాగు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కనకాంబరం సాగు విధానం: కనకాంబరాలు సంవత్సరాంతరం పూలు అందించడంతో పాటు వాసన లేకపోయిన వీటికి మార్కెట్ లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు కనిపించే నారింజ, గులాబి, పసుపు రకాలతో పాటు ఇరర రంగులలో కూడా కనకాంబరాలు ఉంటాయి. ఒకే రంగుతో పాటు.. ఒకే పూవ్వుకు రెండు రంగులు ఉండే కనకాంబరం విత్తన రకాలు సైతం ఉన్నాయి. కాబట్టి రైతులు ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఉండే రకాలను ఎంచుకుని సాగుచేయాలి.

కనకాంబరాలు సాగు చేయడానికి అన్ని సాధారణ నేలలు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అధిక తేమ, వేడి కల్గిన ప్రాంతాల్లో సాగు చేయడం వల్ల దిగుబడి అధికంగా వస్తుంది. ముందుగా నారుమడిని తయారు చేసుకోవాలి. అందులో విత్తనాలను జల్లి.. వాటి పెరుగుదలకు అనుగుణంగా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటితో కలిపి పిచుకారీ చేసుకోవలి. మొక్కలు నాలుగు నుంచి ఆరు ఆకులు వచ్చేంతకు పెరిగిన తర్వాత పొలంలో నాటుకోవాలి. రెండు వరుసల సాలుకి మధ్య సెంటీ మీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య సెంటీ మీటర్లు ఉండేలా నాటుకోవాలి.

పొలాన్ని సిద్ధం చేసే సమయంలోనే పశువుల ఎరువులను చల్లుకోవాలి. పశువుల పేడ ఎరువులతో పాటు 30 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ పాస్ఫేట్, 10 కిలోల పోటాష్ ను వేసుకోవాలి. పంట పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఒక ఎకరం పొలానికి దాదాపు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. పంట మూడు, ఆరు నెలల సమయంలో యూరియాను మొక్కలకు వేసుకోవాలి. మొక్కల పెరుగుదల, అవసరాలను బట్టి నీరును అందించాలి.

Share your comments

Subscribe Magazine