రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువుగా సాగయ్యే వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎంతోమంది రైతులు పత్తి సాగుకు సన్నద్ధమవుతున్నారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లైతే పంట దిగుబడి పెరగడమే కాకుండా నాణ్యత కూడా పెరుగుతుంది. అయితే వాతావరణ పరిస్థితులను అంచనా వెయ్యడం కష్టతరంగ మారుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీస్తాయి, తద్వారా రైతులు నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. పంటల దిగుబడి దెబ్బతీసే కారకాల్లో పురుగులు మరియు చీడపీడలు అతి ప్రధానమైనవి, చీడపీడలు ఆశించిన పంటలు నాణ్యత బాగా తగ్గిపోతుంది.
ఇటువంటి పరిస్థితులు అన్నిటిని ఎదుర్కోవాలంటే, అంతర పంటల సాగు మాత్రమే మంచి పరిస్కారం. రైతులు అంతర పంటలు సాగు చెయ్యడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఏదైనా కారణంచేత ప్రధాన పంట నష్టపోయిన సారె ఈ అంతర పంటలు రైతులను ఆదుకుంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల అంతర పంటలు ప్రధాన పంటలను చీడపీడల నుండి కూడా రక్షణ కల్పిస్తాయి.
ఇప్పటికి చాలా మంది రైతులు పంటల సాగుకోసం వర్షాల మీదే ఆధారపడుతున్నారు. వాతావర్ణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా వర్షాలు సమయానికి పడక బెట్ట పరిస్థితులు ఏర్పడి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఇటువంటి ప్రాంతాల్లో అంతర పంటల సాగు రైతులు చేయూత వంటిది. వాతావరణ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే రేటింపు లాభాన్ని పొందే వీలుంటుంది. అంతర పంటలు సాగుతో భూసారాన్ని కూడా పెంచుకోవచ్చు. అయితే అంతర పంటల ఎంపికలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏమిటంటే....
ప్రధాన పంట మరియు అంతర పంటల వేరు వ్యవస్థలో వ్యత్యాసం ఉండాలి. నేల నుండి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటలను ఎంపిక చేసుకోవాలి, లేదంటే పంటలు నీటి ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రధాన పంటకంటె ఎక్కువ లేదంటే తక్కువ కాలపరిమితి ఉన్న పంటలను ఎంపిక చేసుకోవాలి. పప్పుజాతి పంటలను సాగు చేస్తే నేలలో సారం పెరిగి ప్రధాన పంట పెరుగుదలలో దోహదపడుతుంది. ఈ అంతర పంటలు చీడపీడలను ఆకర్షించి ప్రధాన పంటకు నష్టం వాటిల్లకుండా కాపాడతాయి.
పత్తి పంటలో, అంతర సాగుకు అనువైన పంటల్లో మొదటిది కంది, ప్రతి 4 వరుసలు, లేదా 6 వరుసలు ఒక వరుస కందిని సాగు చెయ్యాలి. సొయా బీన్ పంట కూడా కందిలో అంతర పంటగా సాగు చెయ్యడానికి అనుకూలంగా ఉంటుంది, దీని కోసం 1 వరుస పట్టి మరొక్క వరుస సొయా బీన్ సాగును చేపట్టాలి, దీని మూలంగా భూమిలోని సహజవనరులన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని రేటింపు లాభాలను ఆర్జించవచ్చు. వీటితో పాటు పెసర మరియు మినుము పంటలను కూడా అంతర పంటలుగా సాగుచేసుకోవడానికి అనుకూలం. పప్పుజాతి పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా దిగుబడి పెరగడంతోపాటు, భూమిలోని సారం కూడా పెరుగుతుంది.
Share your comments