వ్యవసాయ క్షేత్రంలో పంటకోతల తర్వాత మిగిలిన వ్యర్థాలను నిరుపయోగం అనుకొని చాలావరకు రైతులు వాటిని వ్యవసాయక్షత్రం లోనే మంటకి ఆహుతి చేస్తున్నారు. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా రైతు సోదరులు దీనికి అలవాటుపడ్డారు. దీనికి వివిధ రకాల కారణాలున్నాయి.
*వ్యవసాయ క్షేత్రంలో మిగిలిన వ్యర్థాలను ఎటు దారి మళ్ళించాలో తెలియని అయోమయ పరిస్థితిలో వాటిని అక్కడే తగలబెట్టేస్తున్నారు.
*మంట పెట్టడం ద్వారా పురుగులు మరియు వ్యాధికారక జీవులు చనిపోతాయని అనుకోవడం.
*మంటకి ఆహుతైన తర్వాత తద్వారా వచ్చే బూడిద నేలకి మేలు చేస్తుంది అని అనుకోవడం.మరికొన్ని తప్పుడు సమాచారాల మేరకు రైతులు దీనికి పాల్పడుతున్నారు.
పంట అవశేషాల దహనం వల్ల వచ్చే అనర్థాలు:
* ఈ పంటల వ్యర్థాలను మంటకి ఆహుతి చేయడం వళ్ళ భూసారం తగ్గిపోతుంది.
*నేలలొ సహజంగా ఉండి మొక్కలకు మేలు చేసే సూక్ష్మ జీవులు నశిస్తాయి,వీటి నష్టం వెల కట్టలేనిది.
*నేలలో తేమ శాతం తగ్గిపోయి దాని ప్రభావం పెద్దమొత్తంలో పంటల దిగుబడిపై పడుతుంది.
*నేలలో ఉన్న సేంద్రీయ కర్బన పదార్థం తగ్గుదలకి దారి తీస్తుంది.
*నేలకోతకి గురై సహజంగా ఉన్న మృత్తిక రూపురేఖలు మారిపోయి పంటల దిగుబడికి తగ్గిపోతుంది.
*దహనం వల్ల వచ్చే పొగ ద్వారా వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది.
*సాధారణంగా ఒక టన్ను వ్యవసాయ వ్యర్థాలను దహించి వేయడం వల్ల సుమారుగా 1500 కిలోల బొగ్గుపులుసు వాయువు గాలి లోకి విడుదల అవుతుంది.
*చివరగా నేలలో భూసారం తగ్గిపోయి పంటలకు పోషకాలని అందించే సామర్థ్యాన్ని కోల్పోతుంది, ఈ పోషకాలను భర్తీ చేయడం చాలా సమయం,మిక్కిలి శ్రమ మరియు కర్హుతో కూడుకున్నది.
రైతు సోదరులు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే పంట అవశేషా ల దహన వళ్ళ వచ్చే ఉపయోగాలు తాత్కాలికం కానీ దాని అనర్థాలు దీర్గకాలికం. ఒక సమస్యకి తాత్కాలిక ఉపశమనం ఎప్పటికి పరిష్కారం కాదు.
పరిష్కారం:
రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సన విషయం ఏంటంటే పంటల కోత తర్వాత మిగిలిన అవశేషాలలో ఏది కూడా నిరుపయోగం కాదు ఆకులు,మొదళ్ళు ,మోడులు వీటన్నిటిని పలవంతనగా వాడుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
*మిగిలిపోయిన వ్యర్థాలను పొలంలోనే కలియ దున్నాలి తద్వారా నేలకి సహజంగా కర్బన పదార్థం సమకూరుతుంది
*వీటిని కుళ్లించి కంపోస్ట్ ఎరువుగా మార్చి తదుపరి వేసే పంటలకు సహజ ఎరువుగా వాడుకోవచ్చు.
*చెఱుకు పిప్పి, వరి గడ్డిని మరియు మిగిలిన అవశేషాలను కూరగాయల సాగులో మరియు పండ్ల తోటలలో (mulching ) మొక్కల మొదళ్ళ దగ్గర కప్పి ఉంచి తేమ శాతాన్ని పెంచవచ్చు.
పంట మిగులు అవశేషాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభత్వ ప్రోత్సాహం:
పంట అవశేషాల నిర్వహణ పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. రైతులు వీటి సేవలను కూడా పొందవచ్చు.
పంట అవశేషాల నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణ అనే పథకం కింద రైతులు 80 శాతం వరకు రాయితీలను పొందవచ్చు.
మరిన్ని చదవండి
Share your comments