Agripedia

పంతి పంటను ఆశించే రసం పీల్చు పురుగులు, యాజమాన్య పద్దతులు!

KJ Staff
KJ Staff
Cotton Cultivation
Cotton Cultivation

 ఈ నెల మొదటి వారంలో రుతుపవనాల ఆగమనంతో రైతులు వర్షాధార పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు చోట్లు మొక్కజోన్న, పత్తి, కందులు, జోన్నలు వంటి పంటల విత్తనాలు నాటుకున్నారు. ఇక మన దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అధికంగా పండించే పంటల్లో పత్తి ఒకటి.  పత్తిలో హైబ్రీడ్ బీటీ విత్తనాలు రావడంతో ఇదిరకటి కంటే తక్కువగానే చీడపీడల ఆశిస్తున్నాయి. ముఖ్యంగా కాయతొలుచు పురుగు ప్రభావం తగ్గిపోయింది. అయితే, కాయతొలుచు పురుగులు బెడద పోయిందనుకున్న రైతులకు.. రసం పీల్చే పురుగులు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పత్తిని ఆశించే రసం పీల్చు పురుగులైన నల్లి, తామరాకు పురుగులు, తెల్లదోమ, పెనుబంక, పచ్చదోమ వంటివి పత్తిని పంటను ఆశించకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, యాజమాన్య పద్దతులు గురించి వ్యవసాయ నిపుణులు చెబుతున్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

పత్తిని ఆశించే పెనుబంక పురుగులు పత్తి ఆకులు, లేత కొమ్మల భాగాల నుంచి రసాన్ని పీల్చుతాయి. దీంతో ఆకులు, కాండంపై బూజు ఏర్పడుతుంది. పెనుబంక ఆశించడం వల్ల మొక్కల పెరుగుదల మందగిస్తుంది.  దీని నివారణ కోసం వేప గింజల కషాయం లేదా వేప నూనె పిచిచారీ చేసుకోవాలి. లేదా మార్కెట్ లభించే ఇతర రసాయన మందులు వాడుకోవాలి. మొక్కలు కొద్దిగా పెరిగిన తర్వాత, పూ మొగ్గలు పెట్టిన సమయంలో తామర పురుగులు పత్తి పంటను ఆశిస్తాయి. పిల్ల పురుగులతో పాటు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం, కొమ్మలు, కాండం, పూ మొగ్గలపై చేరి రసాన్ని పీల్చుతాయి. దీని వల్ల ఆకులు రాలిపోతాయి. మొక్కలు గిడసబారి పోతాయి.

దీనిని మొదట్లోనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి. లేకుంటే పంట దిగుబడిపై అధిక మొత్తంలో ప్రభావం చూపుతుంది. పత్తి పంటను తామర పురుగులు ఆశిస్తే.. పురుగుల ఉధృతిని.. పంట పరిస్థితికి అనుగుణంగా రసాయన మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.  లీటరు నీటిలో 2మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ కలిపి పిచికారి చేయాలి.  తొలిదశ, ప్రభావం తక్కువగా కనిపించిన సమయంలో వేపనూనె లేదా వేప గింజల కషాయం పిచికారి చేసుకుంటే రసం పీల్చు పురుగుల బెడద తగ్గుతుంది.

Share your comments

Subscribe Magazine