Agripedia

బాస్మతి బియ్యం మరియు ఉల్లిపాయలపై కనీస ఎగుమతి ధర ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

KJ Staff
KJ Staff
central government scrapped minimum export price on  basmati rice and onions
central government scrapped minimum export price on basmati rice and onions

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం, ప్రభుత్వం బాస్మతి బియ్యం కోసం టన్నుకు USD 950 కనీస ఎగుమతి ధర (MEP) ను రద్దు చేసింది మరియు ఉల్లిపాయలపై టన్నుకు USD 550 MEPను రెండింటిని రద్దు చేసింది.

దేశీయ నూనెగింజల రైతులు మరియు ఇక్కడి చిన్న పరిశ్రమలను ఆదుకోవాలనే లక్ష్యం తో ప్రభుత్వం శనివారం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 20 శాతానికి మరియు శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 32.5 శాతానికి పెంచింది.

"దేశ ఆహార భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన రైతు సోదర సోదరీమణుల శ్రేయస్సు కోసం మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఉల్లి ఎగుమతి సుంకాన్ని తగ్గించడం మరియు  నూనెలపై  దిగుమతి సుంకాన్ని పెంచడం వంటి అనేక నిర్ణయాలు మన రైతులకు ఎంతో మేలు చేస్తాయి. దీంతో వారి ఆదాయం పెరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి." అని మోడీ తన సోషల్ మీడియా ట్విట్ లో పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం పట్ల సున్నితంగా వ్యవహరిస్తోందని, వారి అభివృద్ధి, ప్రగతికి కట్టుబడి ఉందని పేర్కొన్న చౌహాన్ ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40 నుంచి 20 శాతానికి తగ్గించడం వల్ల ఉల్లి రైతులకు మంచి ధరలు లభిస్తాయని, ఎగుమతులు పెరుగుతాయన్నారు.

Related Topics

centragovtscheme

Share your comments

Subscribe Magazine